AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నేను సౌత్ ఇండియన్‏ను.. నా యాస అలాగే ఉంటుంది.. ట్రోలింగ్ పై కౌంటరిచ్చిన రష్మిక..

పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. సౌత్ టూ నార్త్ వరకు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా రణబాలి సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక తన భాష యాస పై వస్తున్న ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

Rashmika Mandanna: నేను సౌత్ ఇండియన్‏ను.. నా యాస అలాగే ఉంటుంది.. ట్రోలింగ్ పై కౌంటరిచ్చిన రష్మిక..
Rashmika, Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2026 | 2:55 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం రణబాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దుమ్మురేపుతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు విజయ్, రష్మిక. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. అలాగే తన యాస పై వస్తున్న ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రష్మిక. తాను చేసే పని విషయంలో అలాంటి వ్యాఖ్యలకు హద్దులు విధించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. తన సహజమైన యాసను తప్పుగా చూడడంలో అర్థం లేదన్నారు. హిందీ సినిమాల్లో నటన, భాష, డైలాగ్స్ చెప్పే విధానం.. ఇలా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏదోక విషయంలో తనను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. అయితే తన గురించి వచ్చే ట్రోల్స్, విమర్శలు ఎప్పుడూ కూడా తన కెరీర్ ఎంపికలను నిర్దేశించాలని గానీ.. విభిన్న రంగాలను అన్వేషించకుండా తనను ఆపాలని గానీ తాను ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

రష్మిక మాట్లాడుతూ.. “నేను సినీ పరిశ్రమలో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుండి, నా నటన, భాష, నటన, యాస లేదా మరేదైనా విషయంపై విమర్శలు లేదా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉన్నాను. అందుకే, నాకంటూ నేను ఎప్పుడూ ఒక అడ్డంకిని సృష్టించుకోవాలనుకోలేదు. నేను కేవలం ఒకే పరిశ్రమలో పనిచేయాలనుకోలేదు. నేను అన్నింటిలోనూ పనిచేయాలనుకున్నాను. నేను కేవలం ఒకే భాష మాట్లాడాలనుకోలేదు. నేను అన్ని భాషలూ మాట్లాడాలనుకున్నాను. ఒక నటిగా నన్ను నేను సవాల్ చేయాలనుకున్నాను. అందుకే చిన్న వయసులోనే విభిన్న రకాల చిత్రాలతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాను. విభిన్న వ్యక్తిత్వాలు గల పాత్రలను పోషించడం ఆ ప్రణాళికలో భాగమే. అలాగే యానిమల్, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నా పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ఎంజాయ్ చేశాను” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

“నా కెరీర్ ప్రారంభంలోనే నేను అన్ని రకాల సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అందుకే ఈ రోజు యానిమల్ అండ్ గర్ల్‌ఫ్రెండ్ లాంటి అద్భుతమైన చిత్రంలో భాగమైనప్పుడు, ఒక నటిగా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే, నేను అన్ని రకాల పాత్రలు పోషించగలుగుతున్నాను. అందుకే ఈ రోజు, ‘ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది, ఒక యానిమల్ ఉంది” అని అన్నారు. అలాగే తన యాసపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. “నేను దక్షిణాది యాస పలుకుతున్నట్లు కొందరు అంటున్నారు. అవును. నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి నాకు ఆ యాస ఉంటుంది. అలా కాకుండా మరోలా ఉండాలని అనుకోవడం సమంజసం కాదు. ఒక పాత్రకు వేరొక స్వరం బాగా సరిపోతుందని దర్శకుడు భావిస్తే, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను నియమించుకునే ఆలోచనకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకులు నన్నే డబ్బింగ్ చెప్పమన్నారు. అందుకే నాకు గర్వంగా అనిపించింది. ఎందుకంటే, ఇన్ని భాషల్లో నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పగలగడం చాలా కష్టమైన పని. కానీ అదే సమయంలో, నేను అది చేయగలిగితే, అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు” అని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతిలో హిందీ, తెలుగు భాషలలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మైసా, రాకా చిత్రాల్లో నటిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Follow Us
చింతపండు, టమాటా లేకుండానే చేపల కూర.. ఇలా చేస్తే రుచికి తిరుగుండదు
చింతపండు, టమాటా లేకుండానే చేపల కూర.. ఇలా చేస్తే రుచికి తిరుగుండదు
యాసపై ట్రోలింగ్.. ఇచ్చిపడేసిన రష్మిక..
యాసపై ట్రోలింగ్.. ఇచ్చిపడేసిన రష్మిక..
'2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం'.. CM రేవంత్‌
'2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం'.. CM రేవంత్‌
భారతదేశంలో చూడాల్సిన 8 అద్భుతమైన పూల మార్కెట్లు..
భారతదేశంలో చూడాల్సిన 8 అద్భుతమైన పూల మార్కెట్లు..
తొలి టీ20లో భారత్‌కు బిగ్ టార్గెట్.. గెలిస్తే చరిత్రే
తొలి టీ20లో భారత్‌కు బిగ్ టార్గెట్.. గెలిస్తే చరిత్రే
తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే
తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే
రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన దొంగలు
రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన దొంగలు
ట్యూబ్‌లెస్ టైర్‌లో గాలి తగ్గుతోందా? ఈ 6 జాగ్రత్తలు పాటిస్తే..
ట్యూబ్‌లెస్ టైర్‌లో గాలి తగ్గుతోందా? ఈ 6 జాగ్రత్తలు పాటిస్తే..
జాబ్ అలర్ట్.. APPSC గ్రూప్ 1 దరఖాస్తులకు దగ్గరపడుతోన్న గడువు!
జాబ్ అలర్ట్.. APPSC గ్రూప్ 1 దరఖాస్తులకు దగ్గరపడుతోన్న గడువు!
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు