AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

ఉత్కంఠభరితంగా సాగుతున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఏడో వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షాలినిని సీక్రెట్ రూం అంటూ రెండు రోజులు గడిపేసి తిరిగి హౌస్ లోకి పంపించారు. దీంతో అటు ఆటలో మాటల యుద్దాలు, షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని విపరీతంగా పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడో వారంలో నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగింది. అయితే ఈ వారం ఓటింగ్ లో రోహిత్ అట్టడుగు స్థానానికి పడిపోయాడు.

Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!
Bigg Boss 10 Telugu Voting
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2026 | 6:18 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారానికి చేరుకునేసరికి హౌస్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నిలవడం గమనార్హం. గత వారాలతో పోలిస్తే ఈసారి నామినేషన్ల జాబితా పెద్దదిగా ఉండటంతో హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ల ప్రవర్తన, వారి ఆటతీరు ఓటింగ్ ట్రెండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు ఓటింగ్‌లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన రోహిత్ గ్రాఫ్ ఈవారం ఊహించని విధంగా పడిపోయింది. మొన్నటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్నవారికి, రోహిత్‌కి మధ్య భారీ తేడా ఉండేది. కానీ ఈవారం అనూహ్యంగా త్రిగుణ్ రోహిత్‌కి అతి సమీపంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ (25 శాతం), త్రిగుణ్ (24 శాతం) ఓట్లతో తొలి రెండు స్థానాల్లో హోరాహోరీగా కొనసాగుతున్నారు. రోహిత్ వ్యవహారశైలి, ప్రవర్తన కారణంగానే ఆయన ఓటింగ్ గ్రాఫ్ కొంత నెమ్మదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ వారం హౌస్‌లో షాలిని ఎలిమినేషన్ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఆమెను మొదట ఎలిమినేట్ చేసినట్లు చూపించి సీక్రెట్ రూమ్‌కి పంపి, ఆ తర్వాత వెంటనే హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇప్పించారు. అయితే దీనివల్ల రోహిత్ ప్రవర్తన , ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వారాల్లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే భారీ ఆధిక్యంలో ఉండే రోహిత్ ఓటింగ్, ఈసారి పడిపోయి కేవలం 1% తేడాతో త్రిగుణ్‌తో సమానంగా పోటీ పడే పరిస్థితికి రావడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి టాప్ 5 కంటెస్టెంట్లను ఉంచాలంటే, మిగిలిన 7 వారాల్లో కనీసం రెండు లేదా మూడు డబుల్ ఎలిమినేషన్లు జరగాల్సిందే. అందుకే ఈసారి ఏకంగా 12 మందిని నామినేట్ చేయడం ద్వారా బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్‌కు ప్లాన్ చేశారనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో రామకృష్ణ (ఆర్కే) మూడో స్థానంలో ఉండగా, మిగతా కంటెస్టెంట్లు తక్కువ ఓట్లతో కింది స్థానాల్లో ఉన్నారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్ , దక్షి గుత్తికొండ ఇద్దరూ కేవలం 2 శాతం ఓట్లతో లీస్ట్ పొజిషన్‌లో కొనసాగుతూ తీవ్రమైన డేంజర్ జోన్‌లో నిలిచారు. వారం కనుక డబుల్ ఎలిమినేషన్ జరిగితే, ప్రస్తుతం లీస్ట్‌లో ఉన్న ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నీతూ మాస్టర్, దక్షి హౌస్ నుంచి బయటికి వెళ్లే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మరి వీకెండ్ హోస్ట్ ఎపిసోడ్‌లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, నాగార్జున ఎవరిని సేఫ్ చేస్తారో వేచి చూడాల్సిందే.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

Follow Us