AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రావాల్సిన వందేమాతరం చిత్రం ఆగిపోవడంపై దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణనిచ్చారు. బాలకృష్ణతో రైతు ప్రాజెక్ట్, అమితాబ్ బచ్చన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు, గులాబీలో టబు నటించలేకపోవడానికి గల కారణాలు, రమ్యకృష్ణ-కమల్ హాసన్ పుకార్లను ఖండిస్తూ, తన జీవిత తత్వాలను కూడా పంచుకున్నారు.

Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..
Krishna Vamsi, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2026 | 7:20 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన దర్శకత్వ ప్రస్థానం, పలు ప్రాజెక్టులు, వ్యక్తిగత అభిప్రాయాలపై మాట్లాడారు. చిరంజీవి గారితో చేయాలని భావించిన వందేమాతరం చిత్రం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని, అది తప్పకుండా ఉంటుందని, అయితే చిరంజీవి గారితో కాకపోవచ్చని కృష్ణవంశీ స్పష్టం చేశారు. చిరంజీవి గారు తాను కలిసి సినిమా చేయాలనుకుంటే, ఆ నిర్ణయం ఆయనదేనని, పిలిచి చేద్దాం అని అంటే తప్పకుండా వెళ్లి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాల తొలి కాపీ చూసినప్పుడు కలిగే అనుభూతిని కృష్ణవంశీ పంచుకున్నారు. చంద్రలేఖ సినిమా తొలి కాపీ చూసినప్పుడు సంతృప్తి చెందలేదని, నిన్నే పెళ్ళాడతా విషయంలోనూ అదే విధంగా నిరాశ చెందానని తెలిపారు. ఇది కేవలం చంద్రలేఖకు మాత్రమే పరిమితం కాదని, అన్ని సినిమాల విషయంలోనూ తనకి ఇలాంటి అనుభూతే ఉంటుందని, ఇప్పుడు కొంతవరకు అలవాటు పడి దాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వివరించారు. ఏ సినిమా ముందుగానే పోతుందని తాను నిర్ణయించుకోలేదని, బ్రహ్మం గారిని కాలేదని సరదాగా వ్యాఖ్యానించారు.

బాలకృష్ణ గారితో ప్లాన్ చేసిన రైతు ప్రాజెక్ట్ గురించి అమితాబ్ బచ్చన్ గారితో ఒక పాత్ర కోసం కలిసి వచ్చామని, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. గులాబీ చిత్రం టబు నటించలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ, మొదట టబుకు కథ చెప్పామని, ఆమెకు నచ్చిందని, అయితే రుక్ రుక్ రుక్ పాటతో వచ్చిన స్టార్‌డమ్ కారణంగా డేట్స్ క్లాష్ అయ్యాయని తెలిపారు. ఆమె కోసం ఆరు నెలలు ఆగాల్సి వస్తుందని, అంత సమయం లేకపోవడంతో వేరే వారిని ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. గులాబీ చిత్రం కోసం తాను సురేష్ బాబు గారిని కలిసానని, వెంకటేష్ గారితో తీయమని సురేష్ బాబు గారు అడిగినా, తాను చక్రవర్తితోనే చేస్తానని పట్టుబట్టడంతో ఆ ప్రాజెక్ట్ వేరే దిశగా సాగిందని వివరించారు.

సినీ పరిశ్రమలో జరిగే కొన్ని పుకార్లపై ఆయన స్పందించారు. రమ్యకృష్ణ, కమల్ హాసన్, గౌతమి విడిపోవడానికి రమ్యకృష్ణ కారణమన్న పుకారును ఆయన పూర్తిగా ఖండించారు. రమ్యకృష్ణ, గౌతమి చాలా మంచి స్నేహితులని, వెబ్‌సైట్లలో వచ్చే ఇలాంటి అవాస్తవ కథనాలను నమ్మవద్దని ఆయన సూచించారు. వ్యక్తిగత తత్వాలపై మాట్లాడుతూ, సమాజంలో మందు, విందు, పొందు వంటివి సినీ పరిశ్రమకే పరిమితం కాదని, అన్ని రంగాల్లోనూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దొరికినవారిని చూసి అసూయ పడడం తప్ప, వాటిని వద్దనుకునేవాడు ఎవరూ లేరని అన్నారు. జీవితంలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ముందు దానిని అనుభవించాలని ఆయన చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

Follow Us