AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇట్స్ అఫీషియల్.! ఓటీటీలోకి రణబాలి.. విజయ్ దేవరకొండ, రష్మిక సినిమా ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మొదటి సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. రజనీకాంత్ నటించిన జైలర్ 2 పోటీలో ఉన్నా రణబాలి సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

ఇట్స్ అఫీషియల్.! ఓటీటీలోకి రణబాలి.. విజయ్ దేవరకొండ, రష్మిక సినిమా ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
Ranabaali
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2026 | 4:24 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.  థియేటర్స్ లో రణబాలి సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన రణబాలి ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. నవంబర్ 13 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రణబాలి సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటించిన చిత్రంగా రణబాలిపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

బ్రిటీష్ వలస పాలన కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో రణబాలి కథను రూపొందించారు. 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్, ఎమోషన్స్, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు.ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. టీ-సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో కనిపించారు.  ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..