Vijay-Rashmika: విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'రణబాలి'. దసరా కానుకగా విడుదలైన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కూడా దాటేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా కావాలనే చేసే తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డి.సి.పి.కి వారు అందజేశారు. విరోష్ గౌరవాన్ని కాపాడేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారి టీమ్ తెలియజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా రష్మికతో ఉన్న ఓ రొమాంటిక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమను ట్రోల్ చేస్తోన్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘నా ప్రాణ స్నేహితురాలు, నా భార్య, నా ప్రియురాలు రష్మిక. మేం చాలా సంతోషంగా ఉన్నాం. రష్మికతో జీవితం పంచుకోవడం ఆశీర్వాదం. ‘ఒకవేళ నేను, ఆమె ఈప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నామనిపిస్తే అలాగే కానివ్వండి. ప్రస్తుతం నా జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నా. పెళ్లి తర్వాత నేను అనుభవిస్తున్న సంతోషాన్ని నా ముఖంలో చూడండి. అలాగే నా నటనలో, నా సినిమాల్లో చూడగలరని ఆశిస్తున్నాను. నేను ఎంతో అదృష్టవంతురాలిని. నా కుటుంబం గురించి పూర్తిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఫెమినిజం ముసుగులో జరుగుతున్న వేధింపు మాత్రమే. పదేళ్లుగా నాపై ప్రేమను కురిపిస్తూ, ఆదరిస్తున్నందుకు కన్నడ స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు విజయ్.
దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్..

Vijay Deverakonda And Rashmika Mandanna
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




