బెంగళూరు ఐటీ కంపెనీలు కన్నడిగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, రెజ్యూమ్లలో కన్నడ అని రాస్తే తిరస్కరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఒక మహిళ పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ పరిణామంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సీరియస్ అయ్యారు. స్థానికులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఐటీ సంస్థలను హెచ్చరించారు.