AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

మీరు ఒంటరికిగా ఉన్నప్పుడు ఓ భారీ అడవి పంది మీకు ఎదరైతే ఎవరైనా ఏం చేస్తారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టడమో లేదా దానికి కనిపించకుండా దాక్కోవడో చేస్తారు. కానీ ఇక్కడో 14 ఏళ్ల బాలుడు మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు.. ఏకంగా ఆ అడవి పందితో రెండు గంటల పాటు పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
Odisha Boy Fights Wild Boar For 2 Hours (2)
Anand T
|

Updated on: Aug 26, 2026 | 10:01 PM

Share

14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్‌ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ పక్కనుంచి నడుచుకుంటూ పొలానికి వెళ్తున్నాడు.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ అడవిపంది వేగంగా బాలుడిపైకి దూసుకొచ్చింది. అది గమనించిన సమన్ ఆ పంది నుంచి తప్పించుకోవడానికి వెంటనే పక్కనే ఉన్న కాలువలోకి దూకేశాడు. అయితే ఆ పంది కూడా బాలుడిని వెంబడించే క్రమంలో కాలువలోకి దూకేసింది. అదే అదునుగా భావించిన సుమన్.. ఆ పంది నోటిని గట్టిగా ఒడిపి పట్టుకున్నాడు.

ఆ పంది తన శక్తినంతా ఉపయోగింనా ఆ బాలుడి పట్టు నుంచి విడిపించుకులేకపోయింది. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఆ పందితో పోరాడాడు సమన్.. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు నీటిలో పందిని పట్టుకున్న ఉన్న సుమన్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అటవీశాఖ అధికారుల సహాయంతో అడవి పందిని బంధించారు.

అనంతరం పందిలో జరిగిన పోరాటంలో గాయపడిన సుమన్‌ను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. అయితే తన ప్రాణాలను కాపాడుకునేందుకే తన బలాన్నంతా ఉపయోగించిన ఆ అడవి పందితో పోరాడినట్టు సుమన్ తెలిపాడు. అయితే బాలుడు పందితో నీటిలో పోరాడుతున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..