త్రిషతో లిప్ లాక్ సీనా.. ? చెయ్యనని తెగేసి చెప్పిన స్టార్ హీరో.. 

Rajitha Chanti

Pic credit - Instagram

26 August 2026

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో చెరగని ముద్ర వేసుకున్న కథానాయిక త్రిష.

టాలీవుడ్, కోలీవుడ్‌లలోని దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ భామ, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

అయితే తన సినీ కెరీర్‌లో త్రిష ఎప్పుడూ పరిమితులు దాటిన రొమాంటిక్ లేదా లిప్ లాక్ సీన్లలో నటించడానికి ఇష్టపడలేదు. అలాగే ఓ హీరో లిప్ లాక్ సీన్ వద్దన్నాడు.

కానీ ఓ సూపర్ హిట్ సినిమాలో స్వయంగా చిత్ర యూనిట్ త్రిషతో లిప్ లాక్ సీన్ ప్లాన్ చేసినప్పటికీ, ఒక  స్టార్ హీరో సున్నితంగా తిరస్కరించడం విశేషం

ఆ హీరో ఎవరో కాదు.. వర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. వీరిద్దరి కాంబినేషన్‌లో సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ '96'.

2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

 ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కథలోని కొన్ని సన్నివేశాలకుగానూ రామ్, జానుల మధ్య ఒక లిప్ లాక్ చిత్రీకరిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించిందట.

ఈ విషయాన్ని విజయ్ సేతుపతి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన దానికి అస్సలు ఒప్పుకోలేదట. ఈ కథలో లిప్ లాక్ సీన్ పెడితే ఆ పాత్రల ఆత్మ దెబ్బతింటుందని  స్పష్టం చేశారట.