కొత్త ఫోన్ కొన్నారా..? మీ వాట్సప్ చాట్ తిరిగి పొందొచ్చు..
Venkatrao Lella
Images: Pinterest
26 August 2026
కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు వాట్సప్ ఛాట్, ఫొటోలు, వీడియోలు కోల్పోతామోనని చాలామంది భయపడుతుంటారు. అయితే ఆండ్రాయిడ్‌లో గూగుల్ అకౌంట్ బ్యాకప్ లేదా ఐఫోన్‌లో ఐక్లౌడ్ బ్యాకప్ పెట్టుకుంటే ఎలాంటి నష్టం ఉండదు.
వాట్సప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు బ్యాకప్ పెట్టుకున్న మెయిల్ ఐడీ సెలక్ట్ చేసుకుంటే మీ ఛాట్, ఫొటోలు, వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. మీ వాట్సప్‌లో స్టోర్ అయినా సమాచారం మొత్తం వస్తుంది. ఇదెలా అంటే..
ముందుగా వాట్సప్‌ను కొత్త ఫోన్‌లో ఇన్‌స్టా్ చేశాక మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. అనంతరం మీ పేరు, ఫొటో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి.
అనంతరం రీస్టోర్ ఆనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి
మీ వాట్సప్ బ్యాకప్ మెయిల్ ఐడీని ఎంచుకుని నెక్ట్స్‌కు వెళ్లండి. అనంతరం బ్యాకప్ మొత్తం కొత్త ఫోన్‌లోకి వచ్చేస్తుంది.
పాత ఫోన్‌లో ఉన్నట్లుగానే మీ వాట్సప్ ఛాట్, హిస్టరీ, ఫొటోలు, వీడియోలు అన్నీ వచ్చేస్తాయి
అదే ఐఫోన్‌లో కూడా వాట్సప్ చాట్ హిస్టరీని పొందవచ్చు. ఐక్లౌడ్ బ్యాకప్ ద్వారా పొందాల్సి ఉంటుంది.
ముందుగా వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అనంతరం చాట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత చాట్ బ్యాకప్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
మీ చాట్‌లు బ్యాకప్ చేసి ఉంటే మీ చివరి బ్యాకప్ సమయం, పరిహణం మీకు కనిపిస్తుంది.