AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్‌లకు డిమోషన్..!

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ భారీగా దూసుకెళ్లాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన ప్రదర్శన తర్వాత, అతను 711 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్‌తో సమానంగా 7వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని కోల్పోగా, మిచెల్ స్టార్క్ నెం. 1 స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ టాప్ 10 నుంచి బయటకు వచ్చేశాడు.

Venkata Chari
|

Updated on: Aug 26, 2026 | 9:35 PM

Share
ICC Test Rankings: టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమంగా నిలిచి, ఇప్పుడు టాప్ 10లో చేరాడు.

1 / 5
ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు టాప్ 10లో కూడా లేని రిషబ్ పంత్, ఇప్పుడు 711 రేటింగ్ పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో, శుభ్‌మన్ గిల్‌కు కూడా 711 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీని ప్రకారం, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నారు.

2 / 5
గాలెలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు సాధించాడు. ఫలితంగా, పంత్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. మరోవైపు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యాడు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు.

3 / 5
గాలే టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించని యశ్వహి జైస్వాల్ టాప్ 10 నుండి బయటకు పడిపోయాడు. రెండు స్థానాలు దిగజారిన జైస్వాల్, 701 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానానికి పడిపోయాడు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో చేసిన పరుగులను ఈ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. దీని కారణంగా ర్యాంకింగ్ జాబితాలో మార్పులు జరిగాయి.

4 / 5
ఈలోగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని కోల్పోగా, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బుమ్రా మినహా, టాప్ 10లో మరే ఇతర భారత బౌలర్ లేడు. టాప్ 20లో, మహమ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు దిగజారి 18వ స్థానానికి, రవీంద్ర జడేజా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానానికి పడిపోయారు.

5 / 5
Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !

కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్

ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..

'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల

క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?

కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!

వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది

రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే

ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్

ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?