వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు
వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువడం లేదు. దీంతో వర్షాలు లేక చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కరువు పరిస్థితి చూసి తట్టుకోలేక రైతులు పురాతన ఆచారాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని పాల్తూరులో రైతులు వర్షాల కోసం గాడిదలకు వివాహం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గాడిదలకు పూజలు చేస్తూ వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రజల ప్రగాడ నమ్మకం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
