కొబ్బరి పాలలో సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇది పశువుల పాలకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతూ శరీరానికి సమృద్ధిగా శక్తిని, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.
దీనిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి శరీరంలో కొవ్వుగా మారకుండా నేరుగా కాలేయానికి చేరి శక్తినిస్తాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.
కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
దీనిలోని లారిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్లు శరీరంలో మోనోలారిన్‌గా మారి యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగిస్తాయి. ఇవి వివిధ రకాల వైరస్‌లు, బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలపరుస్తాయి.
దీనిలోని లారిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్లు శరీరంలో మోనోలారిన్‌గా మారి యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగిస్తాయి. ఇవి వివిధ రకాల వైరస్‌లు, బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలపరుస్తాయి.
ఇందులో మెగ్నీషియం, ఫోస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తం ఒత్తిడిని సమతుల్యం చేసి నరాలను, కండరాలను శాంతపరుస్తాయి. అలాగే ఎముకల సాంద్రతను పెంచి ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని, వాపులను తగ్గిస్తాయి.
ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి ఇది చాలా సురక్షితమైన ఆహారం. ఇందులో ఉండే జింక్, ఫైబర్ ప్రేగుల ఆరోగ్యాని పరిరక్షించి, హానికర బాక్టీరియాను నిరోధిస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగై అల్సర్లు, విరేచనాల సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ చాలా అవసరం. కొబ్బరి పాలలో తగినంత ఐరన్ ఉండటం వల్ల నిత్యం దీనిని తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించి ఎనీమియా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరి పాలు నాచురల్ కండిషనర్‌లా పనిచేస్తాయి. దీనిని జుట్టుకు రాస్తే పొడిబారడం, చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మానికి రాసుకుంటే నాచురల్ మోయిశ్చరైజర్‌లా పనిచేసి ముడతలు, సన్ బర్న్ కాపాడుతుంది.