AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక శుభకార్యాల సమయాల్లో మహిళలు ధరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది పట్టుచీరలకే. పట్టుచీరలు మహిళల సౌందర్యానికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి. అయితే, వీటిని నిర్వహించడం, భద్రపరచడం కాస్త కష్టమైన పని. చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా ఖరీదైన పట్టుచీరలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. కానీ ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు పంపడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పట్టుచీరలను ఇంట్లోనే ఉతికి, వాటి అసలు మెరుపును ఎప్పటికీ కాపాడుకోవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 9:40 PM

Share
పట్టుచీరలు ఎంతో సున్నితమైనవి కావడం వల్ల ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు పంపడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలతో వాటిని ఇంట్లోనే సురక్షితంగా ఉతుక్కోవచ్చు. మొదట చీర కొంగు భాగాన్ని నీటిలో ముంచి రంగు పోతుందో లేదో కలర్ టెస్ట్ చేయాలి.  తీవ్రమైన ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టి, పైన కాటన్ గుడ్డ వేసి తక్కువ వేడితో ఐరన్ చేస్తే పట్టుచీరలు ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తాయి.

1 / 5
కలర్ టెస్ట్ తప్పనిసరి: పట్టుచీరను పూర్తిగా నీటిలో ముంచే ముందు దాని రంగు వదులుతుందో లేదో పరీక్షించాలి. చీరలోని ఒక చిన్న మూలను లేదా కొంగు భాగాన్ని కొద్దిగా నీటిలో ముంచి చూడాలి. ఒకవేళ నీటిలోకి రంగు వస్తుంటే దానిని ఇంట్లో ఉతకకుండా డ్రై క్లీనింగ్‌కు పంపడమే సురక్షితం. రంగు పోకపోతే ఇంట్లోనే ఉతుక్కోవచ్చు.

2 / 5
చల్లని నీరు, మైల్డ్ డిటర్జెంట్ వాడకం: పట్టుచీరలను ఉతకడానికి ఎప్పుడూ వేడి నీటిని ఉపయోగించకూడదు, కేవలం చల్లని నీటిని మాత్రమే వాడాలి. సాధారణ డిటర్జెంట్ పౌడర్ల కంటే సిల్క్ దుస్తుల కోసం ప్రత్యేకంగా ఉండే లిక్విడ్ లేదా బేబీ షాంపూ వాడటం మంచిది. షాంపూ కలిపిన నీటిలో చీరను 5 నుండి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం నానబెట్టకూడదు.

3 / 5
రుద్దడం, పిండడం చేయకూడదు: పట్టుచీరలపై బ్రష్‌లు ఉపయోగించడం లేదా చేతులతో గట్టిగా రుద్దడం అసలు చేయకూడదు. అలాగే నీటిని తొలగించడానికి చీరను గట్టిగా పిండకూడదు. ఒక కాటన్ టవల్‌పై చీరను పరిచి, టవల్ నీటిని పీల్చుకునేలా ఒత్తాలి.

4 / 5
నీడలోనే ఆరబెట్టడం, ఐరన్ జాగ్రత్తలు: పట్టుచీరలను ఎప్పుడూ ప్రత్యక్ష ఎండలో ఆరబెట్టకూడదు, ఎండ వేడికి రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. గాలి తగిలే నీడ పట్టున మాత్రమే ఆరబెట్టాలి. చీరను ఐరన్ చేసేటప్పుడు దానిపై ఒక కాటన్ గుడ్డను పరిచి, ఐరన్ బాక్స్‌ను 'Silk Mode' లేదా తక్కువ వేడిలో ఉంచి ఇస్త్రీ చేయాలి. ఈ సులువైన చిట్కాలను పాటిస్తే పట్టుచీరలు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉండటంతో పాటు మీ డ్రై క్లీనింగ్ ఖర్చులు కూడా మిగులుతాయి.

5 / 5
Follow Us
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి

భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి.. ఐదేళ్ల రాజు కథ

సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు? 16 సోమవారాల వ్రతం చేస్తే..

కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు

ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..

రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..

అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్

టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు