- Telugu News Photo Gallery Cinema photos Mahesh babu rajamouli SSMB29 latest moive shooting update on 15 03 2025
SSMB29 నుంచి మరో సాలిడ్ అప్‌డేట్.. సంతోషం లో ఫ్యాన్స్
శత్రువులు ఎక్కడో ఉండర్రా.. అంటూ అ..ఆ సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాసారు గుర్తుంది కదా..? ఇప్పుడు ఈ మాటలే రాజమౌళికి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అదేంటి.. ఈయనకు చుట్టుపక్కల ఉండే శత్రువులు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..? అసలే లీక్స్‌తో తల పట్టుకున్న రాజమౌళికి.. ఓ డిప్యూటీ సిఎం తన ట్వీట్‌తో షాకిచ్చారు. అదేంటో చూద్దామా..?
Updated on: Mar 15, 2025 | 11:31 AM

SSMB29 విషయంలో రాజమౌళి ఎన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటుంటే.. అంత ఎక్కువగా లీక్స్ అవుతున్నాయి. సినిమాలో నటిస్తున్న వాళ్లు.. రాజకీయ నాయకులు కూడా రాజమౌళి సినిమాకు ఊహించని విధంగా ట్విస్టులిస్తున్నారు.

తాజాగా ఓరిస్సా డిప్యూటీ సిఎం ప్రవతి పరిదా వేసిన ట్వీట్ SSMB29 గుట్టు రట్టయ్యేలా చేసింది. SSMB29 షూటింగ్ ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపూట్ జిల్లాలో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి.

ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం చేసిన ట్వీట్‌తో సినిమాలోని క్యాస్టింగ్ లీక్ అయింది. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారనే విషయాన్ని రాజమౌళి చెప్పలేదు కానీ ఉప ముఖ్యమంత్రి తన ట్వీట్‌లో రివీల్ చేసారు.

SSMB29 షూటింగ్ కోసం ఒరిస్సాలోని కోరాపూట్‌ను ఎంచుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూనే.. షూటింగ్‌లో పాల్గొంటున్న రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు చెప్పారు డిప్యూటీ CM ప్రవతి పరిదా. గతంలో పుష్ప 2లోని కొన్ని సన్నివేశాలు మల్కాన్‌గిరిలో షూట్ చేసారని గుర్తు చేసారామె.

తన సినిమా డీటైల్స్ ఎంత గోప్యంగా ఉంచాలని రాజమౌళి ట్రై చేస్తున్నా.. ఏదో విధంగా బయటికొచ్చేస్తున్నాయి.. తాజాగా డిప్యూటీ సిఎం ట్వీట్‌లా..! మార్చి 28న వరకు అక్కడే ఈ షెడ్యూల్ జరగనుంది. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో.. అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేస్తున్నారు దర్శకధీరుడు.




