AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

Phani CH
|

Updated on: Dec 29, 2025 | 5:39 PM

Share

శబరిమలలో 41 రోజుల మండల పూజ వైభవంగా ముగిసింది. అయ్యప్ప స్వామికి స్వర్ణవస్త్రాలంకరణ జరిగింది. ఈ ఏడాది రూ. 332 కోట్లకు పైగా ఆదాయం, 30 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. హరివరాసనం తర్వాత ఆలయం మూసివేయబడింది. డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం మళ్ళీ తెరుచుకోనుంది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.

కేరళలోని శబరిమలలో మండల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా పరిసమాప్తమైంది. శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు సాగిన మండల పూజలు ముగియటంతో.. స్వామికి స్వర్ణ వస్త్రాలంకరణ చేసిన ఆలయ పూజారులు, అనంతరం స్వామి సన్నిధిని మూసివేశారు. శుక్రవారం సాయంత్రం శబరిమలలో తంగి అంకి ఉత్పవాన్న అత్యంత వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలోని అయ్యప్ప స్వామి వారికి బంగారంతో తయారు చేసిన పవిత్ర వస్త్రాన్ని ఈ సందర్భంగా ఊరేగింపుగా సన్నిధానానికి తీసుకువచ్చారు. అనంతరం స్వర్ణవస్త్రంతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అలంకరించి మండల పూజ నిర్వహించారు. 41 రోజులపాటు భక్తులు నిష్టగా చేసే అయ్యప్ప దీక్ష మండల పూజతో పరిసమాప్తమవుతుంది. శుక్రవారం రాత్రి పదిగంటలకు హరివరాసనం పవళింపు కీర్తన పఠించి ఆలయాన్ని మూసివేశారు. డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 27 వరకు 30లక్షల 56 వేల మంది భక్తులు హరిహరి సుతుడు అయ్యప్పను దర్శించి తరించారు. నిరుడు ఈ 41 రోజుల మండలపూజ సందర్భంగా రూ. 297 కోట్ల విలువైన కానుకలు రాగా, ఈ ఏడాది మరో 25 కోట్ల మేర పెరిగి.. మొత్తం రూ. 332 కోట్ల 77 లక్షల ఆదాయం వచ్చిందని ట్రావన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్‌ ప్రకటించారు. నిరుటి కంటే ఈసారి 35 కోట్ల 70 లక్షల ఆదాయం పెరిగిందని, కేవలం హుండీ ద్వారానే రూ. 83కోట్ల 17 లక్షల కానుకలు వచ్చాయని ఆయన వివరించారు. రద్దీ పెరిగినా సరే భక్తులందరికీ స్వామిదర్శనం కల్పించామన్నారు ట్రావెన్‌కోర్‌ ప్రతినిధులు. మండలపూజ తొలి నాలుగైదు రోజుల్లో కాస్త భక్తులకు ఇబ్బంది కలిగినా.. తర్వాత తాము తీసుకున్న చర్యలతో అంతా గాడిన పడినట్లు ఆయన వివరించారు. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో చిన్న చిన్న పొరబాట్లు, ఫిర్యాదులు సహజమన్నారు. కాగా, ఈసారి ప్రసాదాలు సరిగా అందలేదన్న భక్తుల ఆవేదనపై కూడా ఆయన స్పందించారు. మకరవిళక్కు పండుగకు ఆలయం తిరిగి తెరిచే నాటికి 12 లక్షల టిన్లుల అదనపు ప్రసాదం డబ్బాలను ఏర్పాటు చేస్తామని దేవస్థాన ప్రతినిధులు వెల్లడించారు. ఇక కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడం వల్ల న్యాయపరమైన విమర్శలు తప్పాయన్నారు ట్రావన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్‌. 41 రోజుల అకుంఠిత దీక్షలు మండలపూజతో పరిసమాప్తమయ్యాయి. ఇక 30 నుంచి మకర విళుక్కు ఉత్సవాల కోసం ట్రావెన్‌కోర్‌ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మకర సంక్రాంతి రోజున శబరిగిరిపై జ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ధురందర్’ పాక్‌ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ