AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్‌

చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్‌

Phani CH
|

Updated on: Dec 29, 2025 | 6:18 PM

Share

చలి తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింది. పూత, పిందెలు రాలిపోవడంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. మరోవైపు, మార్కెట్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి, వినియోగదారులపై భారం మోపుతున్నాయి. టమోటో, బీర, ఆకుకూరలు వంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

చలి తీవ్రత పెరిగిపోయింది. బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారు. చలి ప్రభావం కూరగాయల సాగుపై తీవ్రంగా పడుతోంది. చలి తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింది. చలి కారణంగా ఆకు మొత్తం నల్లబడిపోవటంతో పూత రాలిపోతుంది. చలి కారణంగా మిగిలిన కొద్దిపాటి పిందెలూ తొలిదశలోనే రాలిపోవటంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గి రైతన్న ఆర్థికంగా నష్టాలపాలవుతున్నాడు. మరోవైపు, మార్కెట్‌కు వస్తున్న కూరగాయలను రైతుల నుంచి కొని, వినియోగదారులకు అమ్ముతున్న వ్యాపారులు మాత్రం డిమాండ్‌కు తగిన సప్లై లేదనే కారణం చూపి.. సుమారుగా 50 శాతం మేర పెంచిన ధరలకు కూరగాయాలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేజీ 20 రూపాయలకు దొరికే టమోటో 60 నుంచీ 70 రూపాయలు పలుకుతుంది. బీర కాయ కేజీ ధర.. వంద దాటిపోగా, బెండ, కాకర, పచ్చి మిర్చి ధరలూ సెంచరీకి దగ్గరగా ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తక్కువ ధరకు దొరికే ఆకు కూరలు ఇప్పుడు కేజీ 150 రూపాయలు పెడితే గాని దొరకడం లేదు. దాదాపుగా అన్ని రకాల కూరగాయల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో రేట్లు పెరిగిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

‘ధురందర్’ పాక్‌ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే