AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమెజాన్‌లో ఆర్డర్ పెట్టగా పార్శిల్ వచ్చింది.. ఓపెన్ చేయగా దిమ్మతిరిగే షాక్

కొన్నిసార్లు మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ప్రొడక్ట్స్ మిస్‌ప్లేస్‌మెంట్‌లు జరుగుతుంటాయి. ఒకటి ఆర్డర్‌ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఫోన్లు ఆర్డర్‌ చేస్తే బిస్కెట్లు, రాళ్లు వంటివి పార్శిల్స్‌లో వచ్చిన ఘటనలను ఇప్పటికే అనేకం చూశాం. అయితే, తాజాగా బెంగళూరు జంటకు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో షాకింగ్‌ అనుభవం ఎదురైంది.

Viral Video: అమెజాన్‌లో ఆర్డర్ పెట్టగా పార్శిల్ వచ్చింది.. ఓపెన్ చేయగా దిమ్మతిరిగే షాక్
Amazon Package
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2024 | 11:20 AM

Share

ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ పెడుతున్నారా? అ‍యితే  జాగ్రత్త అండోయ్. కష్టమర్స్‌కు.. ఇంటివద్దకే సేవల్ని అందించడంలో పేరుగాంచిన ఈ సంస్థలు ఈ మధ్య ట్రెండ్ మార్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు.. ఫోన్లు, గాడ్జెట్లకు బదులు సబ్బుబిళ్లలు, ఇటుకలు పంపిన దాఖలాలు చూశాం. కానీ ఇప్పుడు బతికున్న పాముని డెలివరీ చేయడం చర్చనీయాంశమైంది. బెంగళూరులోని సర్జాపూర్‌కు చెందిన భార్యభర్తలు ఐటీ జాబ్స్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో టైమ్ పాస్ కోసం వీడియోగేమ్‌ ఆడుకునే ఎక్స్‌బాక్స్‌ను అమెజాన్‌ కంపెనీ యాప్‌లో ఆర్డర్‌ చేశారు. చెప్పిన టైంకే పార్శిల్ వచ్చింది. ప్రొడక్ట్ ఎలా ఉందా అని చూసేందుకు ఆత్రంగా.. పార్శిల్‌ ఓపెన్‌ చేసేందుకు యత్నించి.. బిత్తరపోయారు. వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ పార్శిల్‌లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది.  అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో.. ఆ పాముకు పూర్తిగా బయటకు రాకపోవడంతో.. ప్రమాదం తప్పింది. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ దంపతులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సమస్యను అమెజాన్‌కు విన్నవించగా.. కంపెనీ ప్రతినిధులు తమను 2 గంటల పాటు హోల్డ్‌లో ఉంచారని దంపతులు వాపోయారు. ఆ తర్వాతే రెస్పాండ్ అయినట్లు చెప్పారు.   కస్టమర్ వీడియోపై స్పందిస్తూ అమెజాన్ ఇండియా కంపెనీ స్పందిస్తూ ట్వీట్ చేసింది. అమెజాన్ ఆర్డర్‌తో మీకు అసౌకర్యం కలిగినందుకు క్షమించాలని కోరింది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి వివరణ ఇస్తామని తెలిపింది. వారు చెల్లించిన మొత్తాన్ని కూడా వారికి రిటన్ చేసింది. ఆ సాఫ్ట్‌వేర్ జంట తమ ఆర్డర్‌లో వచ్చిన పామును సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ఆర్డర్ పెట్టినవారికి రకరకాల వింత అనుభవాలు ఎదురైన ఘటనలు ఉన్నాయ్. కానీ పాము రావడం మాత్రం నిజంగా షాకింగ్ అనుభవం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..