Viral: అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు!
అతిథి మర్యాదలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడైనా.. జిల్లాకు వచ్చిన కొత్త అధికారి అయినా ఇక్కడి మర్యాదలకు, ఆత్మీయతకు ఫిదా కాక మానరు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జేసీఐ ఇంటర్నేషనల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళనుంచి రికేష్ శర్మ హాజరయ్యారు. ఇంకేముంది. రికేష్ శర్మను తమ అతిథి మర్యాదలతో అదరగొట్టేశారు స్థానికులు.
అతిథి మర్యాదలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడైనా.. జిల్లాకు వచ్చిన కొత్త అధికారి అయినా ఇక్కడి మర్యాదలకు, ఆత్మీయతకు ఫిదా కాక మానరు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జేసీఐ ఇంటర్నేషనల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళనుంచి రికేష్ శర్మ హాజరయ్యారు. ఇంకేముంది. రికేష్ శర్మను తమ అతిథి మర్యాదలతో అదరగొట్టేశారు స్థానికులు. భీమవరం పట్టణానికి చెందిన పేరిచర్ల కృష్ణంరాజు 152 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
గోదారోళ్లా.. మజాకా.. ఏకంగా 152 రకాల వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం నింపేశారు. స్వీట్స్, హాట్స్, వేజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానిలు, వేజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, ప్రూట్స్, మరెన్నో వంటకాలతో ఆంధ్రా రుచులు చూపించారు. టేబుల్‌పై అన్ని వంటకాలు చూసిన రికేష్ శర్మ ఆశ్చర్యపోయారు. ఇన్ని రకాల వంటకాలను ఒకే చోట చూడటం ఇదే మొదటి సారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల ప్రజల ఆప్యాయతకు మురిసిపోయారు అతిధులు. ఆంధ్రా వంటకాలను రుచి చూసి .. ఆహా ఏమి రుచి.. అంటూ తృప్తిగా ఆరగించారు. అతిధి సత్కారం చేయడంలో గోదావరి వాసులకు సాటిలేరంటూ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.