Israel – Gaza: ఇజ్రాయెల్ కు షాక్.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సైనిక కాన్వాయ్‌పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సైనిక కాన్వాయ్‌పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత గాజా పోరులో ఇంత మంది సైనికులను ఒక దాడిలో ఇజ్రాయెల్ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందారు. తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్ వసీం మహ్మద్ అని ఐడీఎఫ్ ప్రకటించింది. గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేందుకు వీలుగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకు కాల్పులకు విరామం ప్రకటించింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. రఫా ప్రాంతంలోని 12 కిలోమీటర్ల మేర రహదారి వెంబడి ఈ వ్యూహాత్మక విరామం కొనసాగనుంది. దీంతో గత కొన్ని వారాలుగా మానవతా సాయం అందక, అల్లాడుతున్న పాలస్తీనియన్లను ఊరట లభించనుంది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ విరామం కొనసాగుతుందని ఐడీఎఫ్ తెలిపింది. దీంతో కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర మానవతా సాయంతో వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రహదారి నుంచి ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా.. ఖాన్ యూనిస్.. ఉత్తర గాజాలోని ప్రాంతాలకు మానవతాసాయం అందే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌లో ప్రకంపనలు రేపుతోంది. ప్రధాని నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని సంకీర్ణ ప్రభుత్వంలోని అతి మితవాద నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.