AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Palace: 100 ఏళ్ల పురాతన రాజభవనం హోటల్‌గా.. టాటాతో కీలక ఒప్పందం!

Old Palace: రంగుల పండుగ అయిన హోలీ శుభ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో ఇది రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. పరిశ్రమ, వాణిజ్య మంత్రి సంతాన చక్మా, పర్యాటక మంత్రి సుశాంత చౌదరి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు..

Old Palace: 100 ఏళ్ల పురాతన రాజభవనం హోటల్‌గా.. టాటాతో కీలక ఒప్పందం!
Subhash Goud
|

Updated on: Mar 15, 2025 | 7:11 PM

Share

దేశంలోని అనేక రాజభవనాలు 5, 7 నక్షత్రాల హోటళ్ళుగా మార్చారు. కానీ నేటికీ ఇలాంటి రాజభవనాలు చాలా ఉన్నాయి. అలాంటి 100 సంవత్సరాల పురాతనమైన ప్యాలెస్ విధి మారబోతోంది. రాబోయే మూడు సంవత్సరాలలో దీనిని 5 నక్షత్రాల హోటల్‌గా మార్చబోతున్నారు. దీని బాధ్యతను టాటా గ్రూప్ హోటల్ కంపెనీ IHCL తీసుకుంది. దీనిపై కంపెనీ రూ.250 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది ఎలాంటి రాజభవనం, ఎక్కడ ఉందో తెలుసుకుందాం. అలాగే, టాటా గ్రూప్ ఈ ఒప్పందం ఎవరితో చేసుకుందో కూడా తెలుసుకుందాం.

త్రిపుర ప్రభుత్వంతో ఒప్పందం:

100 ఏళ్ల నాటి పుష్పబంట ప్యాలెస్‌ను ప్రపంచ స్థాయి ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చడానికి త్రిపుర ప్రభుత్వం శుక్రవారం ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంలో రెండు పార్టీలు ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. పుష్పబంట ప్యాలెస్‌లో ప్రపంచ స్థాయి ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేయడానికి తాజ్ గ్రూప్ యాజమాన్యంలోని ఐహెచ్‌సిఎల్ అనే యూనిట్‌తో కలిసి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మీడియాతో ఆయన తెలిపారు. రంగుల పండుగ అయిన హోలీ శుభ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో ఇది రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. పరిశ్రమ, వాణిజ్య మంత్రి సంతాన చక్మా, పర్యాటక మంత్రి సుశాంత చౌదరి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

250 కోట్లు ఖర్చు:

ప్రపంచ స్థాయి ఫైవ్ స్టార్ హోటల్‌ను అభివృద్ధి చేయడానికి IHCL ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి అని సాహా అన్నారు. ప్రతిపాదిత హోటల్‌కు తాజ్ పుష్పబంట ప్యాలెస్ అని పేరు పెడతామని, రాబోయే మూడేళ్లలో తాజ్ గ్రూప్ ద్వారా రూ.250 కోట్ల అంచనా వ్యయంతో దీనిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే తాజ్ గ్రూప్ నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. గతంలో టాటా గ్రూప్ హైదరాబాద్, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లను హోటళ్లుగా మార్చి విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Credit Card: ఈ ఐదుగురు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు.. అప్పులే కాదు సిబిల్‌ స్కోర్‌ గోవిందా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి