Kalki 2 Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కల్కి 2 పై క్రేజీ అప్డేట్ చెప్పేసిన బిగ్ బీ
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్- సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇది వరకే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ రెండవ భాగం కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రను పోషించారు. ఇక సినిమా సీక్వెల్ లోనూ ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బచ్చన్ కూడా కల్కి 2 షూట్ కి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ఈ క్రేజీ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేబీసీ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానన్నారు. కాగా ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని సినీ వర్గాలు తెలిపాయి
కాగా కల్కి సినిమాలో సుమతి (దీపికా పదుకొనే) అపహరణకు గురువుతుంది. దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ భైరవ/కర్ణ (ప్రభాస్) బరిలోకి దిగుతారు. ఇప్పుడీ సీక్వెన్స్ మరింత హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ పోషించిన కమాండర్ యాస్కిన్ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. సీక్వెల్ లో కమల్ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన కల్కి సినిమాలో దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Ab dekhiye #TVParPehliBaar #Kalki2898AD, sirf #ZeeCinema par!
Watch the epic blockbuster ‘KALKI 2898 A.D’ now playing on @ZeeCinemaME.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/zPVM92FRya
— Kalki 2898 AD (@Kalki2898AD) February 16, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.