- Telugu News Photo Gallery Cinema photos This is the movie that was missed in the Pawan Kalyan and Anushka combination!
పవన్ కళ్యాణ్ అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన మూవీ ఇదే!
అనుష్క శెట్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత అనుష్క అంటే ఎంతో మంది చాలా ఇష్టపడే వారు అంతలా ఈ బ్యూటీ అరుంధతి పాత్రలో ఓదిగిపోయింది. కాగా, తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
Updated on: Mar 15, 2025 | 9:43 PM

అనుష్క అంటే తెలియని వారుండరు. ఆ రోజుల్లో వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ బ్యూటీ. నాగార్జున సూపర్ మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

ఇక టాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ఫిమ్స్‌లో కూడా ఈ బ్యూటీకి సాటిలేరు అనేలా తన నటతో ఆ పాత్రలకే ప్రాణం పోసింది.

బాహుబళి వంటి సినిమాల్లో నటించి వరల్డ్ వైడ్ మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఘాటీ సినిమాతో తమ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ చిన్నది.

తాజాగా అనుష్క కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో ఒక సినిమాలు మిస్ అయ్యాయంట .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో ముందుగా అనుష్క అనుకున్నారంట. కానీ స్వీటి శెట్టి మూవీలో తన పాత్ర చాలా చిన్నగా ఉండటంతో త్రిషను ఒకే చేశారంట. ఇలా వీరిద్దరి కాంబోలో మూవీ మిస్ అయ్యింది.



