దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ల సంఘం..!
భారత ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకోసం ఢిల్లీ భారత మండపంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఇది 27 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మధ్య జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం.

భారత ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకోసం ఢిల్లీ భారత మండపంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఇది 27 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మధ్య జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం. EVMలు, ఓటర్ల జాబితాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంపై అంశాలపై అధికారులు చర్చలు జరపనున్నారు. చివరిసారిగా ఇలాంటి సమావేశం 1999లో జరిగింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషి సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, చట్టపరమైన, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. మొత్తం 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారులు (CEOలు) పాల్గొనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ల పనితీరు, ఎన్నికల ప్రక్రియలు, లాజిస్టిక్స్ ను పెంపొందించడం, నిర్మాణాత్మక ఆలోచనల మార్పిడికి ఎన్నికల నిర్వహణలో సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంతో పాటు, సాంకేతికత, EVMలు, ఓటర్ల జాబితా అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇటీవల ప్రారంభించిన ECINET డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఎన్నికల సేవలను క్రమబద్ధీకరించడంలో మార్పులు, సాంకేతికత వినియోగ కార్యాచరణ కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) పటిష్టత, పారదర్శకత, భద్రత అంశాలపై రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీనియర్ ఎన్నికల అధికారులు..
అన్ని ప్రాంతాలలో ఓటర్ల జాబితా తయారీని నియంత్రించే చట్టపరమైన మార్గదర్శకాలను సులభతరం చేయడానికి, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950కి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఓటర్ల అర్హతపై చర్చలు జరగనున్నాయి. ఆర్టికల్స్ 243K, 243ZA ప్రకారం పంచాయతీలు, మున్సిపల్ సంస్థలకు ఎన్నికల జాబితా తయారీ, నిర్వహణ పర్యవేక్షణ, దిశానిర్దేశం నియంత్రణను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా SIR ప్రక్రియ సహా త్వరలో జమిలి ఎన్నికల పై చర్చ జరుగుతున్న నేపథ్యం కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
