AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహితపై హత్యాయత్నం.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టి, తాను కాల్చుకున్న ఉన్మాది..!

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి, ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తను కూడా అదే పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడుతున్నారు.

వివాహితపై హత్యాయత్నం.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టి, తాను కాల్చుకున్న ఉన్మాది..!
Mahabubabad Crime News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 9:37 PM

Share

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి, ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తను కూడా అదే పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో జరిగింది.. అంజయ్య అనే వ్యక్తి పద్మ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తను కూడా అదే పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురవి మండలం మోదుగులగూడెం గ్రామానికి చెందిన అంజయ్య కొన్ని సంవత్సరాలుగా మహబూబాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా చిరు వ్యాపారాలు నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అంజయ్య భార్య మృతి చెందడంతో బానోత్ పద్మ అనే మహిళతో అనైతిక సంబంధం ఏర్పడింది.

ఈ మధ్య కాలంలో బానోత్ పద్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని అంజయ్య గమనించాడు. తనను కాదని వేరొక వ్యక్తితో క్లోజ్‌గా ఉండడాన్ని తట్టుకోలేక ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు అంజయ్య. పద్మ మహబూబాబాద్‌లోని ప్రగతినగర్ లో తన తల్లిగారి ఇంటికి వచ్చిన సమయంలో గమనించిన అంజయ్య పెట్రోల్ బాటిల్‌తో దారుణానికి పాల్పడ్డాడు. పద్మ ఉంటున్న ఇంటికి చేరుకున్న అంజయ్య అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పద్మ మరొకరితో కలసి తిరుగుతున్నదన్న అనుమానంతో, ప్రియురాలు తనకు దక్కనిది, వేరేవారికి కూడా దక్కవద్దని అక్కస్సుతో పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

తాను కూడా అదే పెట్రోల్ మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాపాలైన ఇద్దరిని స్థానికులు జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పద్మకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజయ్యకు ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!