AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే

మూడాల కారణంగా శుభ ముహూర్తాలు లేక గత మూడు నెలల నుంచి కళ్యాణ మండపాలు మూగ బోయాయి.. పెళ్లి నిశ్చయం చేసుకున్న వారు శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు.. మూడు నెలల పాటు వేచిన హృదయాలు పెళ్లి పీటలపై కూర్చునే గడియలు వచ్చాయి.

Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే
Marriage
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 1:41 PM

Share

పెళ్లిపీటలపై కూర్చోవడానికి మూడు నెలల నుండి ముహూర్తాలు లేక మూడాలతో వేచిచూస్తున్న నవదంపతులకు పెళ్లి కళ వచ్చేసింది.. పెళ్లి పీటలపై కూర్చునే శుభముహూర్తం రానే వచ్చింది.. మూడు నెలలు వేచిన ఆ హృదయాలకు ఇప్పుడు రెండు నెలల వ్యవధిలో కేవలం 12 ముహూర్తాలు మాత్రమే కలిసి రావడంతో వేలాది ఇళ్లలో పెళ్లి బాజా బజంత్రీలు మోగుతున్నాయి..కేవలం ఆ 12 మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి..! ఇంతకీ ఆ ముహూర్తాలు ఏవో తెలుసా.

మూడాల కారణంగా శుభ ముహూర్తాలు లేక గత మూడు నెలల నుంచి కళ్యాణ మండపాలు మూగ బోయాయి.. పెళ్లి నిశ్చయం చేసుకున్న వారు శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు.. మూడు నెలల పాటు వేచిన హృదయాలు పెళ్లి పీటలపై కూర్చునే గడియలు వచ్చాయి. ఫిబ్రవరి 19 నుండి ఉగాది వరకు కేవలం 12 మాత్రమే పెళ్లికి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.. వాటిలో ఫిబ్రవరి మాసంలో 19,20,21,22,25,26 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

మార్చి నెలలో 5, 6, 7, 8, 11, 22 తేదీలలో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. ఉగాది తర్వాత మళ్లీ కొత్త పంచాంగం ఆధారంగా శుభ ముహూర్తాలు నిశ్చయిస్తారు.. అయితే మూడు నెలల పాటు వేచి చూసిన నవదంపతులు, పెళ్లిళ్లు చేయించుకున్న కుటుంబాలు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హాల్స్, వస్త్ర దుకాణాలు బంగారు దుకాణాలు, కలకలాడుతున్నాయి.. పురోహితులు, బ్యాండ్ నిర్వాహకులు, డెకరేషన్ సిబ్బంది ఫుల్ బిజీ అయిపోయారు.

Follow Us