AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

Phani CH
|

Updated on: May 06, 2026 | 5:53 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ద్రవిడ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది. ఉప ఎన్నికలో త్రిష బరిలోకి దిగే అవకాశం ఉండగా, టీవీకే పెళ్లికూతుళ్లకు బంగారం, మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు భృతి వంటి అనేక సంక్షేమ హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. వెండితెర ‘దళపతి’ విజయ్, రాజకీయ క్షేత్రంలో ‘అధినేత’గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలి ప్రయత్నంలోనే ఊహించని రీతిలో 108 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని కోటను కొల్లగొట్టింది. ఈ విజయంతో ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చారిత్రక విజయం ఒక ఎత్తైతే, ఇప్పుడు అందరి దృష్టి స్టార్ హీరోయిన్ త్రిషపై నిలిచింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాలి. విజయ్ పెరంబూర్‌ను అట్టిపెట్టుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో త్రిషను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితాల వేళ ఆమె విజయ్ నివాసంలో ప్రత్యక్షం కావడం, స్థానిక వార్తా పత్రికలు ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఆమె రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నిలిచింది. తాము అధికారంలోకి వస్తే పెళ్లికూతుళ్లకు 8 గ్రాముల బంగారం, మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అలాగే, “నిజాయతీతో కూడిన పరిపాలన” అందిస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. వీటితో పాటు ఐదు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు ఐదు లక్షల పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 భృతి, ఉన్నత చదువుల కోసం రూ.20 లక్షల వరకు విద్యా రుణాలు వంటి హామీలు కూడా టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. కోలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ ‘దళపతి’, ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తారో చూడాలి. ముఖ్యంగా త్రిష వంటి స్టార్ ఇమేజ్ ఉన్న నేతలు పార్టీలోకి వస్తే టీవీకే మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విదేశం నుంచి వచ్చి ఓటేసిన విజయ్‌ ఫ్యాన్.. ఆ ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి

Top 9 ET News: ఇది గాలివాటంగా వచ్చిన విజయమా ?? విజయే నమ్మడం లేదా??

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు

Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Follow Us