AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvala Madhuri: 'ఇలా అయితే రాజకీయాలు కష్టం' త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Phani CH
|

Updated on: May 06, 2026 | 5:12 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించి, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది. ఈ ఘన విజయంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ, ప్రత్యేకించి దివ్యేల మాధురి, బండ్ల గణేష్ త్రిషతో ముడిపెడుతూ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ గెలుపుతో త్రిష పేరు కూడా మార్మోగుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితం వచ్చింది. కింగ్ మేకర్ అవుతాడనుకున్న విజయ్ ఇప్పుడు ఏకంగా కింగ్ అయ్యాడు. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది.ఇదే క్రమంలో విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయ్ ఘన విజయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్ని రకాల ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విజయ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి విజయ్ గెలుపును త్రిషతో ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. త్రిష కోరికతో పాటు టీవీకే విజయ్ గెలవాలన్న తన కోరిక కూడా నెరవేరిందని దివ్వెల మాధురి తన పోస్టులో రాసుకొచ్చింది. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని.. వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు రాజకీయాలు చేయలేరని మాధురి అభిప్రాయపడింది. కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది దివ్వెల మాధురి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతకు ముందు బండ్ల గణేష్ కూడా ఇలాగే త్రిషను ట్యాగ్ చేస్తూ ‘ ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష ’ అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి విజయ్ గెలుపుతో త్రిష పేరు కూడా ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత

Chiranjeevi: అప్పట్లో విజయ్‌ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే

Rajinikanth: ‘పీక్ క్రేజ్‌ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

Follow Us