Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత
తళపతి విజయ్ ‘తమిళ వెట్రీ కళగం’ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించి కొత్త చరిత్ర సృష్టించారు. ఎంజీఆర్, జయలలిత వంటి నటుల బాటలో పయనిస్తూ, సినిమా రంగం నుండి ప్రభుత్వ పగ్గాల వైపు అడుగులేశారు. చదువును మధ్యలోనే వదిలి నటనకు ప్రాధాన్యతనిచ్చిన విజయ్, ఇప్పుడు టీవీకే ద్వారా సామాజిక సేవ, రాజకీయ శక్తిగా మారి, తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో సినిమా తారలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందిన ఎమ్జీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా అధికార పీఠం ఎక్కారు. ఇప్పుడు దళపతి విజయ్ కూడా వీరి జాబితాలో చేరారు. ‘తమిళ వెట్రీ కళగం’ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ నేపథ్యంలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయాల్లో కింగ్ గా వారిన విజయ్ చదువు గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 1974, జూన్ 22న జన్మించిన విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు , తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు ఉంది. దీంత చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు విజయ్. చెన్నైలోని ఫాతిమా బాలలోక్ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడీ హీరో. ఆ తర్వాత చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కళాశాలలో ‘విజువల్ కమ్యూనికేషన్’ కోర్సులో చేరాడు. చదువుకుంటున్న రోజుల్లోనే యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు విజయ్. కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించాడు. అయితే చదువు, నటన రెండింటీని హ్యాండిల్ చేయలేక చిన్నతనంలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. చదువు కంటే నటనే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకుని తన కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి, పూర్తిస్థాయిలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. 18 ఏళ్ల వయసులో ‘నాలయ ప్రియ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఇప్పటివరకు 69 చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే, అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా ఉన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా 2007లో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 2009లో తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ అయ్యక్కం’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు విజయ్. ఇప్పుడు ‘టీవీకే’ పార్టీ ద్వారా ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. పొర్టీ పెట్టిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయం సాధించాడు. నయా హిస్టరీ క్రియేట్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: అప్పట్లో విజయ్ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే
Rajinikanth: ‘పీక్ క్రేజ్ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్
Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్ రాజకీయ, సినీ ప్రస్థానం
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి

