విమానం ఎక్కేముందు ప్రతీసారీ.. వారికి నోట్ పంపుతానన్న ఆమిర్
అమీర్ ఖాన్ సినిమాల పట్ల తనకున్న అమితమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రతీ విమాన ప్రయాణానికి ముందు, ఏదైనా జరిగితే తన సినిమా విడుదల ఆగకూడదని సోదరుడు మన్సూర్ ఖాన్‌కు రహస్య లేఖ పంపుతానన్నారు. ఇది సినిమా పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుతం 'ఏక్ దిన్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అమీర్, '3 ఇడియట్స్' సీక్వెల్ ప్లాన్స్‌ను కూడా వెల్లడించారు.
నటన, సినిమా అంటే తనకు ఎంతిష్టమో ఆమిర్ ఖాన్ చాలా సందర్భాల్లో చెప్పడం చూసాం. తాజాగా మరోసారి తనకు సినిమాలపై ఉన్న ప్రేమను తెలిపే విషయాన్ని పంచుకున్నారు. ప్రతీ విమాన ప్రయాణానికి ముందు తన సోదరుడు మన్సూర్ ఖాన్‌కు సీక్రెట్ నోట్ పంపుతానన్నారు, ఆ ప్రయాణంలో తనకు ఏమైనా అయితే విడుదల కానున్న సినిమాను మాత్రం ఆపవద్దని చెబుతానని అన్నారు. ఏదైనా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు తను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే కచ్చితంగా మన్సూర్‌కు ఒక సీక్రెట్ నోట్ పంపుతాననీ తెలిపారు. ఒకవేళ ఆ విమానం కూలిపోయి తను చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వు చూసుకో అని నోట్ సెండ్ చేస్తాననీ అన్నారు. అలాగే దర్శకులతో కూడా అదే విషయాన్ని చెబుతాననీ తనకు ఏమైనా అయినా సినిమాను ఆపొద్దని.. మన్సూర్ సలహాలతో దాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని కోరతానని చెప్పారు. విమాన ప్రయాణం ఎప్పుడు చేసినా తనకేమైనా అవుతుందేమోనన్న భయం ఉంటుందని ఆమిర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆయనకు సినిమాపై ఉన్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్‌ను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా తన సినిమాలకి నియమించుకుంటారు ఆమిర్. నిజానికి ఆమిర్, మన్సూర్ బంధువులే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, ‘జో జీతా వహీ సికందర్’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమిర్ తన కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో 3 idiots సీక్వెల్ కూడా రాబోతుంది. పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాల్లో ఏం జరిగిందనే కథాంశంతో 3 Idiots Sequel తెరకెక్కించబోతున్నట్టు ఆమిర్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
విదేశం నుంచి వచ్చి ఓటేసిన విజయ్ ఫ్యాన్.. ఆ ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి
Top 9 ET News: ఇది గాలివాటంగా వచ్చిన విజయమా ?? విజయే నమ్మడం లేదా??
Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??
Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి

