AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే

మనం ఎంత కష్టపడి పని చేసినా, నెల ఒకటో తారీఖున అకౌంట్‌లో పడ్డ జీతం పదిహేనో తారీఖు వచ్చేసరికి ఎటు పోతుందో అర్థం కాక బుర్ర గీక్కుంటూ ఉంటాం. "అరేయ్, ఈ నెల కూడా ఏం మిగలలేదురా!" అని స్నేహితులతో అనని వారు ఉండరు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలా? అసలు మన సంపాదనలో కొంతైనా వెనకేసుకోవడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా అవుననే చెప్పాలి. దానికి కావాల్సిందల్లా చిన్నపాటి ప్లానింగ్ మాత్రమే.

Phani CH
|

Updated on: May 06, 2026 | 8:03 PM

Share
జీతం అకౌంట్‌లో పడగానే ఫోన్‌కు వచ్చే ఆ మెసేజ్ ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు కదా! కానీ అదే జోష్‌లో అనవసరమైన షాపింగ్‌లు చేసేయకండి. జీతం రాగానే ముందుగా మనం చేయాల్సింది 'పే యువర్ సెల్ఫ్ ఫస్ట్' (Pay yourself first). అంటే ముందు మన భవిష్యత్తు కోసం ఒక 20% అమౌంట్‌ను పక్కన పెట్టేయాలి. ఆ తర్వాతే మిగిలిన ప్రపంచానికి డబ్బులు పంచాలి. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒక మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవడుతుంది.

1 / 5
మన తాతలు, తండ్రులు ప్రతి పైసా లెక్క రాసుకునేవారు. మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉండి అది మర్చిపోయాం. ఒక చిన్న డైరీలో లేదా యాప్‌లో మీ ఖర్చులను రాసి చూడండి. నెల చివరలో అనవసరంగా ఏ కాఫీకో, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకో ఎంత తగలేశామో మనకే అర్థమవుతుంది. ఆ చిన్న చిన్న లీకేజీలను అరికడితే చాలు, పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

2 / 5
తక్కువ డౌన్ పేమెంట్ కదా అని అన్నింటికీ ఈఎంఐలు పెట్టేయకండి. అవసరం ఉన్న దానికంటే ఆశకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మీ ఈఎంఐల మొత్తం మీ నెలసరి ఆదాయంలో 30-40% మించకూడదు. ఒకవేళ ఇప్పటికే అప్పులు ఎక్కువ ఉంటే, ముందు వాటిని క్లియర్ చేసే ప్లాన్ చేయండి. అప్పు లేని వాడే అసలైన మహారాజు!

3 / 5
డబ్బును బీరువాలోనో, సేవింగ్స్ అకౌంట్ లోనో ఉంచితే అది పెరగదు. ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) వల్ల దాని విలువ తగ్గుతూ ఉంటుంది. అందుకే తెలివిగా మ్యూచువల్ ఫండ్స్, పీఎఫ్ లేదా గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. మనం నిద్రపోతున్నా మన డబ్బు మన కోసం పని చేసి, తిరిగి ఆదాయాన్ని ఇవ్వాలి. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు పునాది.

4 / 5
డబ్బు విషయంలో భార్యాభర్తలు లేదా ఇంట్లో వాళ్ళతో ఓపెన్ గా చర్చించాలి. మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి? పిల్లల చదువుల కోసం ఎంత కావాలి? ఎక్కడికి ట్రిప్ వెళ్లాలి? ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అనవసర గొడవలు రావు. అందరూ కలిసి పొదుపు మంత్రం పాటిస్తే, ఆ ఇల్లు ఎప్పుడూ సుఖసంతోషాలతో కళకళలాడుతుంది.

5 / 5
Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లోకి రూ.15 వేలు.

నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయాను.. 20 లక్షలు ముంచేశాడు..

ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలుసా?

మెస్సీ కంటే రొనాల్డో వద్దే ఎక్కువ ఆస్తులున్నాయా?

'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు

తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..

ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..

పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి

ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకుకు చిటికెలో చెక్