AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి ఫీల్డింగ్‌లో విఫలమయ్యాడు. సునాయాసమైన క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి ఊపిరిపోసిన శశాంక్ తీరుపై ఆ జట్టు ప్రధాన కోచ్ రిక్కీ పాంటింగ్ ఘాటుగా స్పందించారు. ఈ వైఫల్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో పాటు పంజాబ్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.

Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!
Ricky Ponting On Shashank Singh Latest Dropped Catch
Venkata Chari
|

Updated on: May 06, 2026 | 10:16 PM

Share

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను శశాంక్ నేలపాలు చేశాడు. ఈ క్రమంలో కామెంటేటర్లతో మాట్లాడిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్, శశాంక్ ఫీల్డింగ్ తప్పిదాలను ఉద్దేశించి నవ్వుతూనే విమర్శలు గుప్పించారు. బంతి ఎక్కడికి వెళ్లినా అది శశాంక్ వైపుకే వెళ్తున్నట్లు ఉందని, అతడికి ఏదో ‘వైరస్’ సోకినట్లు కనిపిస్తోందని పాంటింగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడి నుంచి ఇలాంటి లోపాలు ఆశించలేమని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

పంజాబ్ ఫీల్డర్ల వరుస తప్పిదాలు..

ఈ మ్యాచ్‌లో ఒక్క శశాంక్ మాత్రమే కాదు, పంజాబ్ ఫీల్డర్లు అందరూ క్యాచ్‌ల పండుగ చేసుకున్నారు. ఎనిమిదో ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను కూపర్ కానలీ వదిలేయగా, ఆ తర్వాతి ఓవర్‌లోనే క్లాసెన్ క్యాచ్‌ను శశాంక్ డ్రాప్ చేశాడు. మరికొన్ని ఓవర్ల తర్వాత లాకీ ఫెర్గూసన్ కూడా కిషన్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న ఇషాన్ కిషన్ 55 పరుగులతో విరుచుకుపడగా, క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ ఆటగాళ్ల ఈ ‘బట్టర్ ఫింగర్స్’ వల్ల హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించేందుకు మార్గం సుగమమైంది.

శశాంక్ ఫీల్డింగ్ కష్టాలు – గతం పునరావృతం..

శశాంక్ సింగ్ ఫీల్డింగ్‌లో తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కూడా శశాంక్ వదిలేశాడు. ఆ తర్వాత రాహుల్ ఏకంగా 152 పరుగులతో రికార్డు సృష్టించి పంజాబ్‌ను దెబ్బతీశాడు. ఫీల్డింగ్ సమస్యల కారణంగానే గతంలో కొన్ని మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించినప్పటికీ, మళ్లీ జట్టులోకి వచ్చిన వెంటనే అదే తప్పును పునరావృతం చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆరంభంలోనే సన్‌రైజర్స్ ఊచకోత..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 38 పరుగులతో రాణించాడు. పంజాబ్ ఫీల్డర్ల వైఫల్యాలను సొమ్ము చేసుకున్న హైదరాబాద్ బ్యాటర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుస క్యాచ్ డ్రాప్స్ కారణంగా ఆత్మరక్షణలో పడ్డ పంజాబ్ బౌలర్లపై హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు.

Follow Us