Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలో ఎండల ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు.. ఏపీలో వైఎస్‌ఆర్ కడప -43, చిత్తూరు -43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ – 42, హన్మకొండ – 40 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.. అమరావాతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలుల అంతరాయం ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ – తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ :-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తువరకు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast) ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి నుండి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కీ.మీ వేగం కలిగిన ఈదురుగాలులు, వడగల్లుతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు – ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
