అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో వందేళ్లుగా ఒక విభిన్న ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ పదేళ్ల బాలికను స్వామివారికి పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి, ఉత్సవ విగ్రహానికి కడతారు. పద్మశాలి వంశం బాలికలను ఎంపిక చేసి, ఉన్నత భవిష్యత్తును నమ్ముతారు.