AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. భారీగా పట్టుబడిన నగదు.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో గతంలో ఎప్పుడూ లేనంత భారీ సొమ్మును సీజ్ చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.2కోట్లు సీజ్ చేశారు పోలీసులు.

Telangana: మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. భారీగా పట్టుబడిన నగదు.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
Telangana Municipal Elections
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Feb 08, 2026 | 3:04 PM

Share

తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు విసృతతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సారి టార్గెట్ మనీ పేరుతో లెక్కకు మించి చేతికి దొరికిన ప్రతిదానిని సీజ్ చేస్తున్నారు పోలీసులు. నగదు, బంగారం, మద్యం, ఉచిత వస్తువులు, తదితర సామాగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ.. సీజ్ చేసి వాటిని ఎన్నికల సంఘానికి రోజువారీగా లెక్కలు పంపుతున్నారు. ఎప్పుడూ లేవి విధంగా సీజింగ్ టార్గెట్ పెట్టుకోని మరి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇవ్వాల్టి వరకు అధికారులు స్వాదినం చేసుకున్న మొత్తం సొమ్ము 2కోట్లు దాటింది.

పట్టుబడిన మొత్తంలో రూ. 89 లక్షల ముప్పైవేల నగదు, 84 లక్షల 89వేల విలువై మద్యం ఉన్నాయి. అలాగే రూ. 14 లక్షల 69 వేల విలువగల గల గోల్డ్ ,సిల్వర్ లాంటి విలువైన మెటల్ వస్తువులు ఉన్నట్లు ఈసీ లెక్కలో పేర్కొన్నారు. ఇవి కాకుండా ఉచితాల కి సంబంధించిన బియ్యం, చీరెలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు ఉన్నట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో అన్ని రకాలు కలిపి రూ. 2కోట్ల కు పైగా విలువ గల సోత్తును స్వాదినం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us