Hyderabad: రూ. 5వేల కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ .. ముఠా ఆటకట్టించిన GST, ఇంటెలిజెన్స్ అధికారులు
హైదరాబాద్ జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న హై ప్రొఫైల్ మోసపూరిత కాల్ సెంటర్ బయటపడింది. సూత్రధారి తోపాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ సంపాదించిన డబ్బుకు పన్ను ఎగ్గొట్టిన ముఠా గుట్టును జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు.

హైదరాబాద్ జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న హై ప్రొఫైల్ మోసపూరిత కాల్ సెంటర్ బయటపడింది. సూత్రధారి తోపాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ సంపాదించిన డబ్బుకు పన్ను ఎగ్గొట్టిన ముఠా గుట్టును జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో జీఎస్టీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా అమాయకులను మభ్యపెట్టి ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ.. కోట్ల రూపాయలను ఈ ముఠా దండుకున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. రూ.5 వేల కోట్ల విలువైన జీఎస్టీలను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితులు ముంబైకి చెందిన ఏసు ప్రభు కుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి, హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఏసుప్రభు కుమార్ Wegofin Digital Solutions Founderగా ఉండి ఈ వ్యవహారం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
నిందితులు ఇద్దరూ ఈ గేమింగ్ సిండికేట్ కు మాస్టర్ మైండ్లుగా ఉన్నట్లు తేలింది. కొన్నేళ్లుగా దేశమంతటా గేమింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించి.. భారీగా సొమ్ము చేసుకుని పన్ను ఎగవేతకు పాల్పడ్డారని జీఎస్టీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఇళ్లు, ఆఫీసుల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
