AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కేవలం తెల్లవారు జాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వాతావరణం, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది..

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Telangana - Andhra Pradesh Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2026 | 3:45 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కేవలం తెల్లవారు జాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. వాయువ్య – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని.. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

ఏపీలో వాతావరణం..

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం – దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక:- రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గరిస్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగాను, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాగల 2 రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ గాను, రాగల 5 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.

రాగల 2 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 3 రోజులు.. ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'