AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: టీకా వేసినా దక్కని ఫలితం.. కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలసలో 9 ఏళ్ల బాలుడు రామవరపు రవణ వీధి కుక్క దాడిలో రేబిస్ బారిన పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కొద్ది వారాల క్రితం కుక్క కాటుకు గురైన బాలుడికి రేబిస్ టీకాలు వేయించినా, జ్వరం వచ్చి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అధికారుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడద, ప్రజా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Andhra News: టీకా వేసినా దక్కని ఫలితం.. కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?
Vizianagaram Rabies Death
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Feb 08, 2026 | 4:59 PM

Share

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలసలో తొమ్మిదేళ్ల ఏళ్ల బాలుడు రామవరపు రవణ మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం వరకు తన తల్లిదండ్రులు, స్నేహితులతో ఆడుతూ పాడుతూ చురుగ్గా గడిపిన రవణ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోకసముద్రంలో నింపింది.

గత నెలలో రవణ వీధిలో ఆడుకుంటుండగా అతని పై కుక్క దాడి చేసింది. ఆ కుక్క దాడిలో రవణతో పాటు మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రేబిస్ నివారణ కోసం అవసరమైన టీకాలు వేయించారు. టీకాలు వేసిన తర్వాత కొన్ని రోజులపాటు బాలుడు ఆరోగ్యంగానే కనిపించడం తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించింది. అయితే గత రెండు రోజుల క్రితం మంగళవారం రవణకు జ్వరం మొదలయ్యింది. కుటుంబ సభ్యులు ఆందోళనతో మళ్లీ బొబ్బిలి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి గమనించి వెంటనే విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే రవణ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు.

వీధి కుక్క కాటు తమ కుమారుడిపై ఇలా ప్రభావం చూపుతుందని ఊహించలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. బాలుడికి చనిపోయే ముందు రేబిస్ లక్షణాలు గమనించారు. అప్పటికే రేబిస్ టీకా వేసినప్పటికీ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడలేక పోయాడు. వైద్యులు రేబిస్ టీకా తో పాటు ఇతర మెరుగైన చికిత్స చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బొబ్బిలిలో చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో రవణతో పాటు గాయపడ్డ ఇతర చిన్నారులు సైతం ఆందోళన చెందుతున్నారు. చికిత్స పొందుతున్న తమ పరిస్థితి ఏంటని ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీకా వేసినా దక్కని ఫలితం..కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి
టీకా వేసినా దక్కని ఫలితం..కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. ఇలా చేయకపోతే క్యాన్సిల్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. ఇలా చేయకపోతే క్యాన్సిల్
మీ కారు ఎంత వేగంతో నడిపితే బెస్ట్ మైలేజీ వస్తుంది? కీలక విషయాలు
మీ కారు ఎంత వేగంతో నడిపితే బెస్ట్ మైలేజీ వస్తుంది? కీలక విషయాలు
ఈ ఒక్క ఆకు బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేసే అద్భుత ఔషధం!
ఈ ఒక్క ఆకు బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేసే అద్భుత ఔషధం!
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..