AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి నిద్రపట్టక మొబైల్ గేమ్ ఆడింది.. కట్ చేస్తే రూ. 1.4 కోట్ల లాటరీ తగిలింది!

నిద్రపట్టని ఒక రాత్రి ఓ మహిళ జీవితాన్ని మార్చేసింది. అర్ధరాత్రి నిద్రపట్టక, ​​కాలక్షేపం కోసం ఆమె తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ లాటరీ గేమ్‌ ఆడటం మొదలుపెట్టింది. అలా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె ఖాతాలోకి ఎన్నడూ ఊహించని జాక్‌పాట్ వచ్చిపడింది. ఆమె సుమారు రూ.1.4 కోట్ల బహుమతిని గెలుచుకుంది. ఈ బహుమతిని గెలుచుకునే అవకాశాలు 20 లక్షలలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అర్ధరాత్రి నిద్రపట్టక మొబైల్ గేమ్ ఆడింది.. కట్ చేస్తే రూ. 1.4 కోట్ల లాటరీ తగిలింది!
Online Lottery Winner
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2026 | 4:28 PM

Share

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు అనుకోకుండా చేసే చిన్న పనులు కూడా జీవితాన్నే మార్చేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. అక్కడ నివసించే సూ రాలీ అనే మహిళకు ఒకరోజు రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు. సమయం గడవడం కోసం ఆమె తన స్మార్ట్‌ఫోన్ తీసి ఆన్‌లైన్ లాటరీ గేమ్ ఆడటం ప్రారంభించింది. కానీ, కొన్ని నిమిషాల తర్వాత తన మొబైల్ స్క్రీన్‌పై కనిపించిన మెసేజ్ చూసి ఆమె షాక్‌కు గురైంది. కేవలం టైమ్‌పాస్ కోసం ఆడిన ఆ గేమ్‌లో ఆమె ఏకంగా రూ. 1.4 కోట్ల జ్యాక్‌పాట్ గెలుచుకుంది.

నివేదిక ప్రకారం.. మోర్స్‌విల్ నివాసి అయిన సూ రాలీ, నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీకి చెందిన టంబ్లింగ్ ట్రెజర్స్ అనే డిజిటల్ ఇన్‌స్టంట్ గేమ్‌లో పాల్గొన్నారు. ఇందుకోసం ఆమె కేవలం 30 డాలర్లు (సుమారు రూ. 2500) ఖర్చు చేసి గేమ్ ఆడారు. అయితే ఈ గేమ్‌లో అత్యున్నత బహుమతి అయిన 1,50,000 డాలర్లు (సుమారు రూ. 1.4 కోట్లు) ఆమెను వరించింది. లాటరీ అధికారుల సమాచారం ప్రకారం, ఈ భారీ మొత్తాన్ని గెలుచుకునే అవకాశం 20 లక్షల మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆ అరుదైన అదృష్టం సూ రాలీని వరించింది.

స్క్రీన్‌పై తానే విజేతనని మెసేజ్ రాగానే సూ రాలీ మొదట నమ్మలేకపోయింది. అర్ధరాత్రి కావడంతో కళ్లు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో అని స్క్రీన్‌ను పదే పదే చూసుకుంది. ఈ గెలుపు వార్తతో ఆమెకు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. ఉదయాన్నే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోగా, వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ఒక కలలా ఉందని ఆమె పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ భారీ లాటరీ సొమ్మును సూ రాలీ ఎంతో వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. చాలా కాలంగా తన ఇంటిని రిపేర్ చేయించి, కొత్త హంగులతో ఆధునీకరించుకోవాలని ఆమె కలలు కంటోంది. ఇప్పుడు వచ్చిన ఈ లాటరీ డబ్బుతో తన కలల ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోనున్నట్లు ఆమె వెల్లడించింది.

జీవితంలో అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టి ఉంటే, ఈ కోట్లాది రూపాయల బహుమతి మరొకరి సొంతమయ్యేది. ఆన్‌లైన్ లాటరీ అనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడినప్పటికీ, సూ రాలీకి మాత్రం ఆ నిద్రలేని రాత్రి జీవితాంతం గుర్తిండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మారిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us