AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా..

సాయంత్రం వేళ వేడి వేడిగా స్నాక్స్ తినాలనుకునే నాన్-వెజ్ ప్రియుల కోసం మటన్ కీమా సమోసా ఒక అద్భుతమైన వంటకం. ముక్కలు చేసిన మటన్ కీమాను ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ప్రత్యేక భారతీయ మసాలాలతో ఉడికించి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. మైదా పిండితో క్రిస్పీగా సమోసా పట్టీలను తయారు చేసి, అందులో ఈ కీమా మిశ్రమాన్ని నింపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. పైన కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ సమోసాలను పుదీనా చట్నీ లేదా టమోటా సాస్‌తో తింటే అమృతంలా ఉంటుంది. ఈ రుచికరమైన సమోసా తయారీ విధానం, చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా..
Mutton Keema Samosa Recipe
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2026 | 8:46 PM

Share

సాధారణంగా మనం బేకరీలు, హోటళ్లలో ఆలు సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు తింటూ ఉంటాం. కానీ, నాన్-వెజ్ ఇష్టపడే వారికి మటన్ కీమా సమోసా ఇచ్చే కిక్కే వేరు. పైన కరకరలాడుతూ, లోపల మసాలా దట్టించిన కీమా ముక్కలతో ఈ సమోసా ప్రతి బైట్‌లోనూ అద్భుతమైన రుచిని ఇస్తుంది. వర్షం పడేటప్పుడు లేదా సాయంత్రం టీ తాగే సమయంలో వేడి వేడిగా ఈ కీమా సమోసాలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన ముఖ్యమైన పదార్ధాలు:

మటన్ కీమా (మెత్తగా చేసిన మాంసం) – 250 గ్రాములు

మైదా పిండి లేదా గోధుమ పిండి – 1 కప్పు

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి సరిపడా తీసుకోవాలి.

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా మీ రుచికి సరిపడా తీసుకోవాలి.

కొత్తిమీర, పుదీనా మరియు వేయించడానికి సరిపడా నూనె.

తయారీ విధానం:

ముందుగా కీమా స్టఫింగ్ సిద్ధం చేయడం ఎలాగో చూద్దాం..

ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించాలి. అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ కీమాను వేసి బాగా కలపాలి. కీమాలోని నీరంతా పోయే వరకు ఉడికించి.. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో బౌల్‌లో మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పల్చటి చపాతీల్లా చేసుకోవాలి. వాటిని మధ్యలోకి కట్ చేసి కోన్ ఆకారంలో మడతపెట్టాలి. మైదా పిండిని నీళ్లలో కలిపి జిగురులా చేసి అంచులను అంటించాలి. ఇప్పుడు ఈ కోన్ లోపల సిద్ధం చేసుకున్న కీమా మిశ్రమాన్ని నింపి, సమోసా ఆకారంలో పూర్తిగా క్లోజ్ చేయాలి.

సమోసాలను నూనెలో వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం హీట్‌లో ఉన్నప్పుడు వేసి, మంటను తగ్గించి వేయిస్తే సమోసాలు క్రిస్పీగా, బంగారు రంగులోకి వస్తాయి. కడాయిలో నూనె వేడి చేసి, సిద్ధం చేసుకున్న సమోసాలను తక్కువ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే.. ఎంతో రుచికరమైన, వేడి వేడి మటన్ కీమా సమోసాలు రెడీ! దీనిని వేడి టీ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వారాంతంలో మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. టేస్ట్‌ అద్దిరిపోతుంది అంతే..!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి