AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Emoji Day 2026: వార్నీ.. మనం రోజూ వాడే ఆ 5 ఎమోజీల అసలు అర్థం ఇదా? 90శాతం మంది తప్పుగానే వాడుతున్నారట..!

World Emoji Day 2026: నేటి డిజిటల్ యుగంలో చాటింగ్ చేసేటప్పుడు ఎమోజీలను ఉపయోగించని వారుండరు. జూలై 17న వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా, చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఐదు ప్రసిద్ధ ఎమోజీల అసలైన అర్థాలను ఇక్కడ మనం తెలుసుకుందాం..మనం తరచూ దండం పెట్టే ఎమోజీని హై-ఫైవ్ అని, ముక్కులోంచి గాలి వదిలే కోపపు ఎమోజీని గర్వం/విజయం అని కాకుండా వేరేలా భావిస్తుంటాం. జపనీస్ భాషలో ఎమోజీ అంటే చిత్రాల ద్వారా భావాలను వ్యక్తపరచడం. యూనికోడ్ కన్సార్టియం నిర్ణయించిన ఈ గుర్తుల అసలు ఉద్దేశాన్ని సరిగ్గా తెలుసుకుని చాటింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.

World Emoji Day 2026: వార్నీ.. మనం రోజూ వాడే ఆ 5 ఎమోజీల అసలు అర్థం ఇదా? 90శాతం మంది తప్పుగానే వాడుతున్నారట..!
World Emoji Day
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2026 | 6:28 PM

Share

నేటి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలో పెద్ద పెద్ద మెసేజ్‌లు రాయడానికి బదులు చిన్న ఎమోజీతో మన భావాలను వ్యక్తపరుస్తున్నాం. ప్రతి సంవత్సరం జూలై 17వ తేదీని వరల్డ్ ఎమోజీ డే (World Emoji Day) గా జరుపుకుంటారు. అయితే, మనం రోజూ చాటింగ్‌లో ఉపయోగించే కొన్ని ఎమోజీల అసలు అర్థం ఏంటో తెలుసా? యూనికోడ్ కన్సార్టియం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చాలా ఎమోజీలకు మనం అనుకునేదానికి పూర్తి భిన్నమైన అర్థాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం:

తప్పుగా అర్థం చేసుకునే 5 ప్రసిద్ధ ఎమోజీలు:

జోడించిన చేతులు 🙏:

చాలామంది దీనిని ఇద్దరు వ్యక్తులు హై-ఫైవ్ ఇచ్చుకుంటున్నట్లు భావిస్తారు. కానీ, దీని నిజమైన అర్థం చేతులు జోడించి నమస్కరించడం, ప్రార్థించడం లేదా కృతజ్ఞతలు చెప్పడం.

ముక్కు నుండి గాలి వచ్చే ముఖం 😤:

ఈ ఎమోజీని కోపం, చిరాకు లేదా అసహనాన్ని చూపించడానికి వాడుతుంటారు. కానీ, దీని అసలు అర్థం విజయం సాధించిన ఆనందం, గర్వపడటం లేదా ఆత్మవిశ్వాసం అని అర్థం.

ఇవి కూడా చదవండి

చేయి పైకెత్తిన వ్యక్తి💁:

దీనిని చాలామంది స్టైల్ లేదా కొంచెం గర్వంగా హావభావాలు చూపించడానికి వాడుతుంటారు. కానీ, ఇది నిజానికి ఇన్ఫర్మేషన్ డెస్క్ పర్సన్ అంటే సహాయం లేదా సమాచారం అందించే వ్యక్తి. నేను మీకు ఎలా సహాయపడగలను? అని అడగడానికి దీనిని వాడాలి.

తల తిరగడం 💫:

దీనిని షూటింగ్ స్టార్ అంటే..రాలిపోయే నక్షత్రం లేదా మ్యాజిక్ స్టార్ అనుకుంటారు. కానీ, దీని నిజమైన అర్థం తల తిరగడం, కళ్ళు తిరగడం లేదా తీవ్రమైన ఆశ్చర్యానికి గురికావడం.

తలపైన చేతులు పెట్టిన వ్యక్తి🙆:

తలపట్టుకుని బాధపడుతున్నట్లు లేదా ఆందోళన చెందుతున్నట్లు చాలామంది దీనిని ఉపయోగిస్తారు. కానీ, ఈ ఎమోజీలో ఉన్న వ్యక్తి రెండు చేతులతో తలపై O ఆకారాన్ని చూపుతూ OK అంతా బాగుంది అని సైగ చేస్తున్నాడు.

ఎమోజీ అంటే ఏమిటి?:

జపనీస్ భాషలో ఇ (E) అంటే చిత్రం, మోజీ అంటే అక్షరం అని అర్థం. అంటే చిత్రాల రూపంలో అక్షరాలను లేదా భావాలను వ్యక్తపరచడమే ఎమోజీ. ఈ వరల్డ్ ఎమోజీ డే నుండి వీటిని సరైన అర్థంతో ఉపయోగించి మీ చాటింగ్‌ను మరింత అర్థవంతంగా మార్చుకోండి!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us