AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైటింగ్, జిమ్‌లు అవసరం లేదు.. సులభంగా బరువు తగ్గడానికి ప్రతిరోజూ చేయాల్సిన 6 పనులు ఇవే!

చెన్నైకి చెందిన ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి, బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన జీవనం కోసం ఆరు ముఖ్యమైన అలవాట్లను సూచించారు. ఈ అలవాట్లు అన్నీ కలిసి పనిచేసినప్పుడు, బరువు తగ్గడం సులభతరం అవ్వడమే కాకుండా, మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించడం కూడా సులభం అవుతుంది. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

డైటింగ్, జిమ్‌లు అవసరం లేదు.. సులభంగా బరువు తగ్గడానికి ప్రతిరోజూ చేయాల్సిన 6 పనులు ఇవే!
Healthy Weight LossImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2026 | 5:07 PM

Share

చాలామంది ఫిట్‌నెస్ అనగానే కేవలం కఠినమైన డైటింగ్, గంటల తరబడి జిమ్‌లలో కష్టపడటం మాత్రమే అనుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, శాశ్వతంగా బరువు తగ్గడానికి ఇవి మాత్రమే సరిపోవని ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్, క్వాడ్ ఫిట్‌నెస్ సహ వ్యవస్థాపకుడు రాజ్‌ గణపత్ చెబుతున్నారు. స్లో బర్న్ మెథడ్ వ్యవస్థాపకుడైన ఆయన, బరువు తగ్గడానికి, ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజూ అలవర్చుకోవాల్సిన 6 ముఖ్యమైన సూత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం:

1. పోషకాలున్న ఆహారం:

బరువు తగ్గడానికి ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మైదా, పంచదార వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, స్టార్చ్, కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని రాజ్ గణపత్ సూచించారు.

ఇవి కూడా చదవండి

2. ఆకలి కంటే కొంచెం తక్కువగా తినడం:

చాలామంది పొట్ట పూర్తిగా నిండే వరకు తింటుంటారు. కానీ, బరువు తగ్గాలనుకునే వారు శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలను తీసుకోవాలి. ఇందుకోసం కడుపు పూర్తిగా నిండక ముందే తినడం ఆపేయాలి. అప్పుడప్పుడు కొద్దిగా ఆకలి వేసినట్లు అనిపించినా, దానిని భరించడం అలవాటు చేసుకోవాలి.

3. రోజంతా చురుగ్గా ఉండటం:

కేవలం ఒక గంట వర్కవుట్ చేసి, రోజంతా కూర్చుని ఉంటే ఫలితం ఉండదు. రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం నడక అత్యంత ఉత్తమమైన, సులువైన మార్గం. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది.

4. క్రమం తప్పకుండా వ్యాయామం:

బరువు తగ్గడానికి చాలా కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన పనిలేదు. వారంలో 3 నుండి 5 రోజులు సాధారణ వ్యాయామం చేసినా సరిపోతుంది. ముఖ్యంగా కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలపై దృష్టి పెట్టడం మంచిది.

5. ఒత్తిడిని నియంత్రించడం:

మానసిక ఒత్తిడి లేదా స్ట్రెస్ బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ఒత్తిడి పెరిగినప్పుడు హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల అతిగా తినడం అలవాటవుతుంది. కాబట్టి, మెడిటేషన్ లేదా నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

View this post on Instagram

A post shared by Raj Ganpath (@raj.ganpath)

6. సరిపడా నిద్ర:

మంచి డైట్, వ్యాయామం ఎంత ముఖ్యమో.. అంతే ముఖ్యమైనది నిద్ర. ప్రతిరోజూ కనీసం 7 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. మెటబాలిజం మెరుగై బరువు తగ్గడం సులువవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!