AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్‌ పెరుగుతుంది.. కొమ్మలు గుబురుగా రావడం ఖాయం!

ప్రతి వంటింట్లోనూ నిత్యం వాడే కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో కొనే కరివేపాకు కంటే ఇంట్లో పెరట్లోనో లేదా కుండీలోనో పెంచుకునే స్వచ్ఛమైన కరివేపాకు ఇస్తే వచ్చే సువాసనే వేరు. కానీ, చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. కరివేపాకు మొక్క నాటినప్పటికీ అది సరిగ్గా పెరగదు, కొమ్మలు రావు లేదా ఆకులు ఎండిపోతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ, మీ కరివేపాకు మొక్కను వేగంగా, గుబురుగా మార్చే ఒక సూపర్ ట్రిక్ ఇక్కడ ఉంది.

Jyothi Gadda
|

Updated on: Jul 16, 2026 | 9:05 PM

Share
భారతీయ వంటకాల్లో కరివేపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది తమ ఇళ్లలోనే కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క సరిగ్గా పెరగకపోవడం లేదా ఆకులు తక్కువగా రావడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కరివేపాకు మొక్కను వేగంగా, దట్టమైన కొమ్మలతో పెరిగేలా చేయడానికి వంటింట్లో దొరికే ఒకే ఒక్క సాధారణ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగ లేదా పెరుగును ఉపయోగించి మొక్కకు అవసరమైన నత్రజని పోషకాలను అందించి, దాని పెరుగుదలను ఎలా రెట్టింపు చేయవచ్చో వివరంగా తెలుసుకోండి.

1 / 5
మొక్కను గుబురుగా మార్చే ఆ ఒక్క చిట్కా: కరివేపాకు మొక్క వేగంగా పెరగడానికి, ఎక్కువ కొమ్మలు రావడానికి పుల్లటి మజ్జిగ లేదా పుల్లటి పెరుగు ఒక అద్భుతమైన సహజ ఎరువుగా పనిచేస్తుంది. కరివేపాకు మొక్కకు అసిడిక్ నేచర్ ఉన్న నేల, నత్రజని  పోషకాలు చాలా అవసరం. పుల్లటి మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, పోషకాలు మట్టిలోని ఫెర్టిలిటీని పెంచి, మొక్క వేర్లను బలోపేతం చేస్తాయి.

2 / 5
ఎలా ఉపయోగించాలి?:  ఒక కప్పు బాగా పులిసిన పెరుగు లేదా మజ్జిగను తీసుకోండి. దానికి దాదాపు 4 నుండి 5 లీటర్ల నీటిని కలిపి బాగా పలచగా చేయండి. ఈ పలచటి మజ్జిగ నీటిని వారానికి లేదా పది రోజులకు ఒకసారి కరివేపాకు మొక్క మొదట్లో వేర్ల దగ్గర పోయాలి. ఈ మిశ్రమాన్ని ఆకులపై కూడా లైట్‌గా స్ప్రే చేయవచ్చు. ఇది ఆకులకు పట్టే తెగుళ్లను, నల్లటి మచ్చలను నివారిస్తుంది.

3 / 5
మరికొన్ని ముఖ్యమైన గార్డెనింగ్ చిట్కాలు: కరివేపాకు మొక్క పైభాగంలో ఉన్న లేత కొమ్మల చివరలను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క నిలువుగా కాకుండా, పక్కల నుండి కొత్త కొమ్మలు వచ్చి గుబురుగా మారుతుంది. కరివేపాకు మొక్కకు రోజుకు కనీసం 5-6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. అలాగే కుండీలో నీరు నిల్వ ఉండకుండా, మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి.

4 / 5
వంటింట్లో వృథాగా పారేసే పుల్లటి మజ్జిగను ఈ విధంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా, మీ ఇంట్లోనే పచ్చటి, సువాసనభరితమైన కరివేపాకును సులభంగా పొందవచ్చు. ఈ వర్షాకాలంలో మీ మొక్కపై ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి..కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోని కరివేపాకు మొక్క గుబురుగా పెరుగుతుంది పక్కాగా.

5 / 5
Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..

రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?

RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా

మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో

సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్

ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..

ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్

బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..

14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!

ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా