Watch: సల్లంగా చూడమ్మ.. హైదరాబాద్‌లో బోనాల పండుగ శోభ.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాలతో వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నామస్మరణే. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి తెల్లవారుజామునే మహా హారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు.
లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాలతో వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నామస్మరణే. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి తెల్లవారుజామునే మహా హారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఆలయం దగ్గర విద్యుత్ అలంకరణలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు సిద్ధం చేశారు. సోమవారం మధ్యాహ్నం రంగం, అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం జరుగుతుంది. బోనాల పండుగ దృష్ట్యా 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయని.. పోలీసులు ప్రకటించారు.
ఇక, అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేథ్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. డిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు, వేపల సువాసనల నడుమ కల్లు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో.. అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

