విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో
స్నానం ఒంటిపై ఉండే మలినాలను తొలగిస్తుంది. చల్లని నీటితో చేసే స్నానం అలసిన శరీరానికి కొత్త శక్తినిస్తుంది. స్నానం శరీరం తో పాటు మనసును కూడా శుద్ధి చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. రోజువారిగా మనిషి చేయాల్సిన క్రియల్లో స్నానం మొదటిగా చెబుతూ ఉంటారు.వివిధ శుభ దినాల్లో పుణ్యనదుల్లో చేసే స్నానం అఖండమైన పుణ్యాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అస్వామికి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఒక వినత కారణంతో బకెట్ల కొద్దీ పాలతో స్నానం చేసి వార్తల్లోకి ఎక్కాడు.
అస్వామ్ లోని ముకుల్ మావా నివాసి అయిన మానిక్ అలీకి తన భార్యతో విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు ఎక్కాడు. చాలా కాలం తర్వాత కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోషానికి లోనైన మానిక్ అలీ ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ఇప్పుడు తన మనసు తేలికపడిందని తాను స్వేచ్ఛగా జీవించే అవకాశం వచ్చిందని మానిక్ చెబుతున్నాడు. తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఇప్పటికే రెండుసార్లు ఆమె తన ప్రియుడితో పారిపోయిందని మానిక్ అలీ చెప్పుకొచ్చాడు. కానీ తన కుమార్తె ముఖం చూసి తన భార్యను భరించారని ఎంత నచ్చ చెప్పిన ఆమె తనను తీరు మార్చుకోకపోవడంతో విడాకులిచ్చినట్లు తెలిపాడు. ఇప్పుడు తాను స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నానని అందుకే తనను తాను శుద్ధి చేసుకోవడానికి కోర్టు నుంచి ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశానని వెల్లడించాడు. కాగా ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

