వానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు తాగాల్సిన పాతకాలపు డ్రింక్ ఇదే
Prasanna Yadla
23 september 2026
Pic credit - Pinterest
బాదం, నల్ల మిరియాలతో చేసిన ఈ పాల డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
నల్ల మిరియాలతో
బాదం, నల్ల మిరియాలతో చేసిన ఈ డ్రింక్ తాగితే రుచిగా ఉండటంతో పాటు వానా కాలంలో శరీరం వేడిగా ఉంటుంది
బాదం, నల్ల మిరియాలతో
దీనిని మీ ఇంట్లో ఉండే వాటితో కూడా చేసుకుని తాగొచ్చు అంతే కాదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఇంట్లోనే ఈజీగా..
10 నుంచి 12 బాదం, 6 నల్ల మిరియాలు, రెండు గ్లాసులు పాలు, రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, సరిపడినంత నీటిని తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా బాదంను తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కనీసం 4 గంటల పాటు వీటిని నానబెట్టాలి. ఆ తర్వాత బాదం తొక్కలను తీసేయాలి.
స్టెప్ 1
ఇక ఇప్పుడు తొక్క తీసిన బాదంను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి ఆ తరవాత దీనిలో నల్ల మిరియాలు కూడా వేసి కలపాలి.
స్టెప్ 2
ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో రెండు గ్లాసుల పాలు పోసి మంటపై వేడి చేయాలి. ఆ తరువాత దీనిలో
బాదం–మిరియాల వేసి బాగా కలపాలి.
స్టెప్ 3
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)