AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఎత్తును పెంచే కమ్మటి హల్వా.. వారం రోజులు నిల్వ ఉండటం పక్కా

పిల్లల సమగ్ర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరగడానికి మరియు కంటి చూపు మెరుగుపడటానికి తీపి గుమ్మడికాయ ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు రోజూ కొద్దిగా గుమ్మడికాయ హల్వా తినిపించడం వల్ల వారి గ్రోత్ చాలా బాగుంటుంది.

Phani CH
|

Updated on: Aug 10, 2026 | 7:35 PM

Share
ఎటువంటి కృత్రిమ రంగులు వాడకుండా, కమ్మటి బెల్లం మరియు నెయ్యితో తయారు చేసే ఈ గుమ్మడికాయ హల్వా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది.

1 / 5
ఈ గుమ్మడికాయ హల్వా తయారీకి ముందుగా ఒక కేజీ పసుపు గుమ్మడికాయను తీసుకుని, శుభ్రంగా కడిగి పై పొట్టును చాకుతో తొలగించాలి. ఆ తర్వాత గ్రేటర్‌తో గుమ్మడికాయను సన్నగా తురుముకోవాలి. ఆరు కప్పుల గుమ్మడి తురుమును పక్కన పెట్టుకోవాలి.

2 / 5
స్టవ్ మీద బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడిచేసి జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేయించి పక్కన తీసుకోవాలి. అదే నేతిలో ఆరు కప్పుల గుమ్మడి తురుము వేసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 4-5 నిమిషాలు వేయించాలి. ఇలా వేయించడం వల్ల గుమ్మడిలోని పచ్చివాసన, ఒగరు తగ్గిపోతాయి.

3 / 5
తురుము కొద్దిగా మగ్గాక రెండున్నర కప్పుల బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పల్చబడుతుంది. హై ఫ్లేమ్‌పై నీరంతా ఇంకిపోయే వరకు ఉడికిస్తూ, మధ్యమధ్యలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి.

4 / 5
హల్వా బాగా దగ్గరపడి నీరంతా ఇంకిపోయాక అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలిపి దింపేస్తే కమ్మటి గుమ్మడికాయ హల్వా సిద్ధమవుతుంది.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల