బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇది ఒక ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో నిర్వాహకులు సరికొత్త హంగులతో ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ప్రేక్షకులకు సుపరిచితులైన సెలబ్రిటీలను పంపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆనందం సినిమా ఫేం రేఖా వేదవ్యాస్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం.