AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. వీడియో వైరల్‌

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. స్పెయిన్ ట్రోఫీ సంబరాల సమయంలో వేదికపై నిలబడటంతో అధికారులు పక్కకు జరగాలని సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. వీడియో వైరల్‌
Donald Trump
Rakesh
|

Updated on: Jul 20, 2026 | 7:28 AM

Share

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026 ముగింపు వేడుకలు ఎంతో కోలాహలంగా సాగాయి. అయితే విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేసే సమయంలో ఒక విచిత్రమైన మరియు కాస్త ఇబ్బందికరమైన ఘట్టం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి బహుమతుల ప్రదానోత్సవ వేదికపైకి వచ్చారు. స్పెయిన్ కెప్టెన్ రోడ్రికి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచకప్ ట్రోఫీని అందజేసిన తర్వాత, ఆటగాళ్లు కప్పును ఆకాశంలోకి ఎత్తి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ ట్రంప్ వేదిక మధ్యలోనే నిలబడిపోవడంతో అధికారులు ఆయనను పక్కకు జరగాల్సిందిగా సూచించాల్సి వచ్చింది.

న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ పోరును తిలకించడానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ ముగిసిన అనంతరం మెడల్స్, ట్రోఫీ ప్రదానోత్సవం కోసం డొనాల్డ్ ట్రంప్ మైదానంలోకి అడుగుపెట్టిన సమయంలో స్టేడియంలోని పెద్ద సంఖ్యలో అభిమానుల నుంచి నిరసనల హోరు ఎదురైంది. ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. ఆ తర్వాత పతకాల ప్రదానం సాఫీగానే సాగినప్పటికీ, వేడుకల సమయంలో ఈ నిరసనల సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ట్రోఫీని కెప్టెన్ రోడ్రి అందుకోగానే జట్టు సభ్యులంతా ఒక్కచోటికి చేరి జయహో అంటూ ట్రోఫీని ఎత్తడానికి సిద్ధమయ్యారు. అయితే ట్రంప్ ఆటగాళ్ల మధ్యలోనే అలాగే నిలబడిపోవడంతో వేడుకల ఫ్రేమ్‌లో ఆటంకం ఏర్పడింది. దీంతో వెంటనే స్పందించిన నిర్వాహకులు, అధికారులు చేతి సంకేతాలతో ట్రంప్‌ను వేదిక పక్కకు తప్పుకోవాలని కోరారు. దీనితో ఆయన కొద్దిగా పక్కకు జరిగారు. గతంలో జరిగిన క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ట్రంప్ చెల్సీ ప్లేయర్లతో పాటు స్టేజీపైనే ఉండిపోగా ఈసారి మాత్రం వరల్డ్ కప్ ప్రొటోకాల్ ప్రకారం ఆయనను వేడుకల ముందు పక్కకు తీసుకెళ్లడం గమనార్హం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఫైనల్లో స్పెయిన్ జట్టు 1-0 గోల్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపించింది. నిర్ణీత సమయంలో ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ తోర్రెస్ కొట్టిన గోల్ మ్యాచ్‌కే తలమానికగా నిలిచింది. అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ సాధించి మైదానం వీడటంతో 10 మందితోనే ఆడిన అర్జెంటీనా ఓటమి పాలైంది. స్పెయిన్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవగా, లార్డ్స్ లేదా గ్రౌండ్‌లోని ట్రంప్ వీడియోలు మాత్రం నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. మార్కులెన్నో చూశారా?
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. మార్కులెన్నో చూశారా?
బరువును తగ్గించే దివ్యాస్త్రం.. జీలకర్ర నీటిని ఇలా తాగితే..
బరువును తగ్గించే దివ్యాస్త్రం.. జీలకర్ర నీటిని ఇలా తాగితే..
బెస్ట్ బైక్స్.. రూ.68 వేల నుంచే ప్రారంభం.. 70కిమీ పైగా మైలేజ్..!
బెస్ట్ బైక్స్.. రూ.68 వేల నుంచే ప్రారంభం.. 70కిమీ పైగా మైలేజ్..!
తెలుగురాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో
లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో
ఆడేది ఆరో మ్యాచ్.. 9ఏళ్ల చెత్త రికార్డ్‌ బ్రేక్ చేసిన మనోడు
ఆడేది ఆరో మ్యాచ్.. 9ఏళ్ల చెత్త రికార్డ్‌ బ్రేక్ చేసిన మనోడు
ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం నాటి దిన ఫలాలు ఇదిగో..
ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం నాటి దిన ఫలాలు ఇదిగో..
అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన స్పెయిన్
అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన స్పెయిన్
కంటి సైట్, చూపు సరిగా లేని వాళ్ళు ఇవి తింటే కళ్ళజోడుకు గుడ్ బై
కంటి సైట్, చూపు సరిగా లేని వాళ్ళు ఇవి తింటే కళ్ళజోడుకు గుడ్ బై