సుమనోహర రూపం.. సుందర వదనం.. స్టన్నింగ్ లుక్ లో కవ్విస్తున్న పాయల్ పాప 

12 June 2026

Pic credit - Instagram

Phani Ch

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్.

చిన్నతనం నుంచే నటనపై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్‎లో సోనాక్షి అనే పాత్రతో టెలివిజన్‎లో తన కెరీర్‌ని ప్రారంభించింది.

2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కథానాయకిగా నటించింది. 2023లో మంగళవారం చిత్రంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పేరు 'వెంకటలచ్చిమి'. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేవలం 'వెంకటలచ్చిమి' మాత్రమే కాకుండా తన తదుపరి కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తానని చెప్పింది.