AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy : రిషబ్ పంత్ కెప్టెన్సీలో కోహ్లీ, రోహిత్..చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ

Vijay Hazare Trophy : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఈ టోర్నీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. దానికి కారణం టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగుతుండటమే.

Vijay Hazare Trophy : రిషబ్ పంత్ కెప్టెన్సీలో కోహ్లీ, రోహిత్..చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
Rohit Sharma Virat Kohli
Rakesh
|

Updated on: Dec 22, 2025 | 1:02 PM

Share

Vijay Hazare Trophy : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఈ టోర్నీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. దానికి కారణం టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగుతుండటమే. రోహిత్ దాదాపు 7 ఏళ్ల తర్వాత, విరాట్ కోహ్లీ ఏకంగా 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ వన్డేల్లో మెరవబోతున్నారు. మరి ఇంతకాలం తర్వాత ఆడుతున్న ఈ ఇద్దరు స్టార్ల పాత రికార్డులు ఎలా ఉన్నాయి? విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరిలో ఎవరిది పైచేయి? అన్న ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.

ముందుగా టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులు పరిశీలిస్తే.. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అతను ఇప్పటివరకు ఈ టోర్నీలో కేవలం 13 మ్యాచ్‌లే ఆడినప్పటికీ, ఏకంగా 819 పరుగులు సాధించాడు. కోహ్లీ సగటు 68.25గా ఉండటం విశేషం. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 106.08గా ఉంది. కోహ్లీ చివరిసారిగా 2009-10 సీజన్‌లో ఈ టోర్నీ ఆడాడు. అప్పట్లో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 229 పరుగులు చేశాడు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీ తరపున బరిలోకి దిగుతున్నాడు.

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల విషయానికి వస్తే.. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడాడు. ఆ 18 మ్యాచ్‌ల్లోని 17 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 581 పరుగులు చేశాడు. రోహిత్ సగటు 38.7గా ఉంది. ఇందులో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ చివరిసారిగా 2018లో ముంబై తరపున ఈ టోర్నీలో కనిపించాడు. మళ్ళీ ఏడేళ్ల తర్వాత ముంబై జెర్సీలో దేశవాళీ మ్యాచ్ ఆడబోతున్నాడు. విరాట్ కోహ్లీతో పోలిస్తే విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ గణాంకాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.

అయితే ఈసారి ఈ ఇద్దరు దిగ్గజాలు ఇతరుల కెప్టెన్సీలో ఆడబోతుండటం మరో విశేషం. ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లీ.. రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. అలాగే ముంబై జట్టులో రోహిత్ శర్మ.. శార్దూల్ ఠాకూర్ నాయకత్వంలో బరిలోకి దిగనున్నాడు. అయితే వీరిద్దరూ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండరు. రోహిత్ శర్మ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికవ్వగా, విరాట్ కోహ్లీ కూడా మూడు మ్యాచ్‌లకు మించి ఆడే అవకాశం లేదని సమాచారం. ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ జట్టుతో ఆడనుండగా, ముంబై జట్టు సిక్కింతో తలపడనుంది. ఈ దిగ్గజాల రాకతో విజయ్ హజారే ట్రోఫీకి ఐపీఎల్ స్థాయి క్రేజ్ రావడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు